# prajatelangana ## Posts - [కరీంనగర్ టూ టౌన్ ఎస్ ఐ చంద్రశేఖర్ బలవన్మరణం](https://prajatelangana.com/karimnagar-ii-town-si-chandrashekar/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్: కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ చంద్రశేఖర్ బలవన్మరణం చెందారు. ఇటీవల ఆయన భార్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భార్య మృతి కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ విషాద ఘటనతో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. మరిన్ని వార్తల కోసం : అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కిన ఎక్సైజ్ సీఐ - [అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కిన ఎక్సైజ్ సీఐ](https://prajatelangana.com/%e0%b0%85%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a8%e0%b1%80%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a7%e0%b0%95-%e0%b0%b6%e0%b0%be%e0%b0%96-%e0%b0%85%e0%b0%a7%e0%b0%bf%e0%b0%95%e0%b0%be/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ :  బుధవారం  కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులను అక్రమంగా కూడబెట్టారనే ఆరోపణలతో సదరు సి ఐ ని అదుపులోకి తీసుకున్నట్లు ఆ శాఖ తెలిపింది.     మరిన్ని వార్తల కోసం : రాబోయే ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలి – మాజీ మేయర్ సునీల్ రావు - [లేబర్ కోడ్లను రద్దు చేయండి](https://prajatelangana.com/%e0%b0%b2%e0%b1%87%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%95%e0%b1%8b%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b0%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%81-%e0%b0%9a%e0%b1%87%e0%b0%af%e0%b0%82/):   కలెక్టరేట్ ఎదుట మెడికల్ రిప్రెజెంటేటివ్స్‌ ధర్నా.. మూడు రోజుల పాటు నిరసనలకు పిలుపు కార్మిక హక్కులు, ఉద్యోగ భద్రతను దెబ్బతీసేలా కొత్త చట్టాలు ఉన్నాయని ధ్వజం సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ (SPE) యాక్ట్ 1976ను పునరుద్ధరించాలని డిమాండ్ 24, 25, 26 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహించాలని పిలుపు అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రెజెంటేటివ్స్‌ యూనియన్ (TMSRU) కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. కార్మిక వర్గానికి, మెడికల్ రిప్రెజెంటేటివ్స్‌కు తీవ్ర నష్టం కలిగించే ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని యూనియన్ నాయకులు నినదించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చీకోటి శ్రీధర్ మాట్లాడుతూ, కార్మిక వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. హక్కులను... - [ఎఫ్ ఈ ఎస్ డీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ](https://prajatelangana.com/fesd-ngo-fruit-distribution/): ప్రజా తెలంగాణ – కరీంనగర్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ & సోషల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.చికిత్స పొందుతున్న రోగులకు అరటిపండ్లు, ఆపిల్‌లతో కూడిన ప్యాకెట్లను అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో విద్య, సామాజిక అభివృద్ధి రంగాలలో కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో హరికృష్ణ, వేములవాడ అనిల్‌కుమార్, మీర్జా అనిల్, సాయిచందర్, సంజయ్, సాగర్, అఖిల్, వినీత్ పాల్గొన్నారు. మరింత  : ఎస్ యూ పరిధిలో మూడో విడత దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ - [ఎస్ యూ పరిధిలో మూడో విడత దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ](https://prajatelangana.com/%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b1%82-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a7%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ae%e0%b1%82%e0%b0%a1%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a1%e0%b0%a4-%e0%b0%a6/): ప్రజా తెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలకు దోస్త్ మూడో విడత అడ్మిషన్లలో 7629 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు  కోఆర్డినేటర్ డా.శ్రీరంగ ప్రసాద్ తెలిపారు.విశ్వవిద్యాలయ పరిధిలోని మొత్తం 36,060 సీట్లలో మొదటి, రెండవ విడతలలో 9455 సీట్లు కేటాయించగా, వాటిలో 6730 మంది విద్యార్థులు అడ్మిషన్ ఖరారు చేసుకోగా, ఇంకా 29,330 సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో మూడో విడత ప్రక్రియ నిర్వహించారు.13 ప్రభుత్వ కళాశాలలలో 1060 మంది విద్యార్థులకు, 3 ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలలో 1046 మంది విద్యార్థులకు , 60 ప్రైవేట్ కళాశాలలలో 5523 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. మూడో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు జూలై 1, 2025 లోపు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్ రిజర్వ్ చేసుకోవాలని ,లేని పక్షంలో సీట్ రిజిస్ట్రేషన్ రద్దు అవుతుందని కోఆర్డినేటర్ తెలిపారు. మరిన్ని వార్తల కోసం : గృహ... - [గృహ నిర్మాణ కార్మిక సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం](https://prajatelangana.com/%e0%b0%97%e0%b1%83%e0%b0%b9-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a3-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%95-%e0%b0%b8%e0%b0%82%e0%b0%98%e0%b0%82/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ : గృహ నిర్మాణ కార్మికులకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామని కరీంనగర్ జిల్లా గృహ నిర్మాణ కార్మిక సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ , ముఖ్య సలహాదారులు మాజీ మేయర్ వై. సునీల్ రావు లు అన్నారు.ఆదివారం రేకుర్తిలోని పుష్పవల్లి గార్డెన్‌లో జిల్లా గృహ నిర్మాణ కార్మిక సంఘం కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లికార్జున రాజేందర్, న్యాయవాది ఏ.కిరణ్‌కుమార్, మాజీ వైస్ చైర్మన్ డి.వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలు నిర్మాణ కార్మికులకు, వారి కుటుంబాలకు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. గృహ నిర్మాణ కార్మికులకు బీమా, మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, పదవీ విరమణ చేసిన వారికి పింఛన్ వంటి సౌకర్యాలు అందేలా కృషి చేస్తామని వెల్లడించారు.అందరి సహకారంతో కార్మిక సంఘం... - [59వ డివిజన్‌లో ప్రధాని మన్ కి బాత్ కార్యక్రమం](https://prajatelangana.com/59%e0%b0%b5-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95%e0%b0%bf-%e0%b0%ac%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 123వ మన్ కి బాత్ కార్యక్రమాన్ని ఆదివారం 59వ డివిజన్‌లో స్థానిక బిజెపి నేతలు , కార్యకర్తలు సమిష్టిగా వీక్షించారు.164వ పోలింగ్ బూత్ అధ్యక్షురాలు పెద్ది లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డిపల్లి శ్రీనివాస్ (బాలు) మరియు వెస్ట్ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.162వ పోలింగ్ బూత్ అధ్యక్షురాలు నేరెళ్ల ధనలక్ష్మి, 166వ పోలింగ్ బూత్ అధ్యక్షులు దయ్యాల కరుణాకర్‌తో పాటు డివిజన్ బిజెపి నేతలు రాగి సత్యనారాయణ, వోల్లేం సంజీవ్‌కుమార్, దయ్యాల అశోక్‌కుమార్, కర్రె రాజమల్లయ్య, పెద్ది లక్ష్మీనారాయణ, గుడిసె రాజయ్య, దయ్యాల సంజీవ్‌కుమార్ సహా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం : రాబోయే ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలి – మాజీ మేయర్ సునీల్ రావు - [అసంఘటిత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా: దరఖాస్తు గడువు పొడిగింపు](https://prajatelangana.com/%e0%b0%85%e0%b0%b8%e0%b0%82%e0%b0%98%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%8e%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8/): ప్రజాతెలంగాణ- కరీంనగర్ : అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకున్న, ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం పొందిన కార్మికులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నదని జిల్లా ఉపకార్మిక కమిషనర్ కోల ప్రసాద్ తెలిపారు. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన క్రింద ఆగస్టు 26, 2001 నుండి మార్చి 31, 2022 మధ్య ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకున్న, ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం పొందిన అసంఘటిత కార్మికుల కుటుంబాలకు/కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నదని కమిషనర్ వివరించారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, అంగవైకల్యం పొందిన కార్మికులకు రూ. 1 లక్ష అందిస్తున్నదని తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని అర్హులైన అసంఘటిత కార్మికులు దరఖాస్తు సమర్పించడానికి జూన్ 30, 2025 వరకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు . అర్హులైనవారు దరఖాస్తుతో పాటు మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు,... - [కొత్తపల్లి పిహెచ్‌సిని సందర్శించిన డిఎంహెచ్‌ఓ డా.వెంకటరమణ](https://prajatelangana.com/%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%aa%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%8e%e0%b0%82%e0%b0%b9%e0%b1%86%e0%b0%9a%e0%b1%8d%e0%b0%93-%e0%b0%aa/): ప్రజాతెలంగాణ- కరీంనగర్: జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.వెంకటరమణ గురువారం కొత్తపల్లి పిహెచ్‌సిని సందర్శించారు.హాజరుపట్టిక, అవుట్ పేషెంట్ రిజిస్టర్లు, ఇతర రికార్డులను పరిశీలించి , పిహెచ్‌సి పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు.ఎన్‌సిడి క్లినిక్‌లో రెడ్, బ్లూ రిజిస్టర్లు చెక్ చేశారు. హైపర్‌టెన్షన్, డయాబెటిస్ పేషెంట్ల వివరాలు, మందుల పంపిణీ పరిశీలించారు. ఫార్మసీలో సీజనల్ మందుల స్టాక్ చూశారు.ఆపరేషన్ థియేటర్, ప్రసూతి గది పరిశుభ్రత, అత్యవసర మందుల లభ్యత పరిశీలించారు. మొదటి ప్రసవాలకు సిజేరియన్ చేయించుకోవడం వల్ల సమస్యలని వివరించి, సాధారణ డెలివరీకి పిహెచ్‌సిలను వాడుకోవాలని కోరారు.బిఎంఎస్ డాక్టర్లకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఫీల్డ్ ట్రైనింగ్ ఇచ్చారు.పిఓఎంహెచ్‌ఎన్ డా.సనజవేరియా, వైద్యాధికారి డా.నజియా, డిపిఓ ఎన్‌హెచ్‌ఎం స్వామి, సాగర్, బిఎంఎస్ డాక్టర్లు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం : సీపీని కలిసిన నూతన అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ - [సీపీని కలిసిన నూతన అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ](https://prajatelangana.com/%e0%b0%b8%e0%b1%80%e0%b0%aa%e0%b1%80%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%95%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%85%e0%b0%a1%e0%b0%bf%e0%b0%b7%e0%b0%a8/): ప్రజాతెలంగాణ – కరీంనగర్: కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా బాధ్యతలు స్వీకరించిన అశ్విని తానాజీ వాకడె గురువారం పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. మరిన్ని వార్తల కోసం : రాబోయే ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలి – మాజీ మేయర్ సునీల్ రావు - [రాబోయే ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలి - మాజీ మేయర్ సునీల్ రావు](https://prajatelangana.com/%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b1%8b%e0%b0%af%e0%b1%87-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ac%e0%b1%80%e0%b0%9c%e0%b1%87%e0%b0%aa%e0%b1%80/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ : రాబోయే ఎన్నికలన్నింటిలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని మాజీ మేయర్ సునీల్ రావు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలనను పురస్కరించుకుని గురువారం 33వ డివిజన్‌లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వ స్మార్ట్ సిటీ మరియు అభివృద్ధి పథకాలే కారణమన్నారు. గత 11 సంవత్సరాలలో ఈ పథకాల వల్ల కరీంనగర్ నగరం గణనీయంగా అభివృద్ధి చెందిందని తెలిపారు.భారతదేశం ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా ఎదగడానికి ప్రధానమంత్రి మోదీ పాత్ర గొప్పదన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, పాకిస్తాన్‌లోని తీవ్రవాదుల నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వంటి చారిత్రక నిర్ణయాలు గతంలో ఏ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలలో భారతదేశాన్ని నాల్గవ స్థానంలో నిలిపిన మోదీకి మద్దతు తెలుపాలని కోరారు.తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్... - [కూచిపూడి పోటీల్లో హుజురాబాద్ చిన్నారికి ప్రథమ స్థానం](https://prajatelangana.com/%e0%b0%95%e0%b1%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%aa%e0%b1%82%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%9f%e0%b1%80%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be/): ప్రజాతెలంగాణ-హుజురాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జరిగిన కళా సమ్మేళన్ 2025లో కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీల్లో హుజురాబాద్ పట్టణానికి చెందిన వై.వినోద్-మహేందర్‌రెడ్డి దంపతుల కుమార్తె నిర్వి రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా బుధవారం కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి , హుజురాబాద్ రూరల్ బిజెపి నాయకులు చిదిరాల శ్రీనివాస్‌రెడ్డి-రాణి దంపతులు వై.నిర్వి రెడ్డిని అభినందించారు.ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు. మరిన్ని వార్తల కోసం : మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు: సీపీ గౌస్ ఆలం   - [133.8 కిలోల గంజాయి దగ్ధం: సీపీ గౌస్ ఆలం](https://prajatelangana.com/133-8-%e0%b0%95%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b%e0%b0%b2-%e0%b0%97%e0%b0%82%e0%b0%9c%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%a6%e0%b0%97%e0%b1%8d%e0%b0%a7%e0%b0%82-%e0%b0%b8%e0%b1%80%e0%b0%aa%e0%b1%80/): ప్రజాతెలంగాణ- కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 133.8 కిలోల గంజాయిని బుధవారం ధ్వంసం చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ తెలిపారు.మానకొండూరు మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్‌లో  డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో  ఈ గంజాయిని దహనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీపీలు వేణుగోపాల్, విజయ్‌కుమార్, ఇన్స్పెక్టర్లు పుల్లయ్య, సంజీవ్, రజినీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం : మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు: సీపీ గౌస్ ఆలం   - [మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు: సీపీ గౌస్ ఆలం](https://prajatelangana.com/%e0%b0%ae%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81-%e0%b0%aa%e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%b2-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae-%e0%b0%b0%e0%b0%b5%e0%b0%be/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్ : నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్ సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు బుధవారం వెల్లడించారు.నార్కోటిక్ జాగిలం ‘లియో’తో జిల్లా కేంద్రంలో తనిఖీలను ముమ్మరం చేసినట్లు కమిషనర్ తెలిపారు. కరీంనగర్ ఒకటవ ఠాణా పరిధిలో బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఎస్సై రాజన్న ఆధ్వర్యంలో బస్టాండ్, పార్సిల్ కార్యాలయాలు, కిరాణా షాపులు, పాన్ షాపులు, హాస్టళ్లు, అనుమానిత ఇళ్లలో  తనిఖీలు నిర్వహించారు నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జాగిలం, డాగ్ హ్యాండ్లర్ కానిస్టేబుల్ ఎ. శంకర్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.ఎవరైనా వ్యక్తుల వద్ద ప్రభుత్వం నిషేధించిన గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు ఉండటం, వాటిని విక్రయించడం గురించి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు తెలియజేయాలని కమిషనర్ గౌస్ ఆలమ్ విజ్ఞప్తి... - [ఆర్టిజన్ కార్మికుల బహిరంగ సభ ను విజయవంతం చెయ్యండి -కునుసోత్ శ్రీనివాస్ నాయక్](https://prajatelangana.com/%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%95%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%ad/): ప్రజాతెలంగాణ-కరీంనగర్ : రాష్ట్రంలోని ఆర్టిజన్ కార్మికుల రెగ్యులర్ కన్వర్షన్ కోసం జూన్ 18న హైదరాబాద్ ఇందిరా పార్కులో జరిగే బహిరంగ సభ ను విజయవంతం చెయ్యాలని కునుసోత్ శ్రీనివాస్ నాయక్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది ఆర్టిజన్ కార్మికులు 25 సంవత్సరాలుగా రెగ్యులర్ చేయాలని పోరాడుతున్నారని , గత ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ స్టాండింగ్ రూల్స్ మాత్రమే అమలు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాదయాత్రల్లో ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు గడిచినా రెగ్యులర్ కన్వర్షన్ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 18న బహిరంగ సభ జరగనున్న బహిరంగ సభ ద్వారా తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోనున్నట్లు తెలిపారు. మరిన్ని... - [లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 3478 కేసుల పరిష్కారం](https://prajatelangana.com/%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b1%8d-%e0%b0%85%e0%b0%a6%e0%b0%be%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b8%e0%b1%8d/): – పీపీలను అభినందించిన కమీషనర్ ప్రజాతెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : గత శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 3,478 కేసులను విజయవంతంగా పరిష్కరించినందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సీపీ ఆలం అభినందించారు. కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని , కేసుల పరిష్కారంలో పోలీసు అధికారుల నుంచి ఏదైనా సమన్వయ లోపం కనిపిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కమీషనర్ సూచించారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పరస్పర సహకారంతో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని వారిని కోరారు.రానున్న అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశంలో చురుకుగా పాల్గొని పోలీసు అధికారులకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ మార్గదర్శకత్వం అందించాలని కమీషనర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కోరారు. ఈ సమావేశం లో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, సీసీఆర్బీ ఏసీపీ... - [ఘనంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు](https://prajatelangana.com/dy-cm-vikramarka-congress-sc-cell/): ప్రజాతెలంగాణ – కరీంనగర్:  జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  అని,  ఆయన ఇలాంటి  పుట్టినరోజు వేడుకలు  ఎన్నో జరుపుకోవాలని అన్నారు. గతంలో వారు తెలంగాణ వ్యాప్తంగా చేసిన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు నీరాజనం పడుతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.తదనంతరం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జింజుపల్లి వివేక్ ఆధ్వర్యంలో స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి తాజుద్దీన్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రావణ్ నాయక్, దండి... - [మంత్రిని కలిసిన నూతన కమిషనర్ ప్రపుల్ దేశాయ్](https://prajatelangana.com/%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%95%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%95%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b7%e0%b0%a8%e0%b0%b0%e0%b1%8d/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ :కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రపుల్ దేశాయ్ ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. మరిన్ని వార్తల కోసం : శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎం.ఫార్మసీ కోర్సుకు ఆమోదం - [శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎం.ఫార్మసీ కోర్సుకు ఆమోదం](https://prajatelangana.com/%e0%b0%b6%e0%b0%be%e0%b0%a4%e0%b0%b5%e0%b0%be%e0%b0%b9%e0%b0%a8-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b0%af%e0%b0%82%e0%b0%b2/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరం నుండి ఎం.ఫార్మసీ కోర్సు ప్రారంభించడానికి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు.ఉమేష్‌కుమార్ తెలిపారు.మానేరు డ్యాం సమీపంలో ఉన్న ఫార్మసీ కళాశాలలో ఫార్మకాలజీ, ఫార్మాసిటిక్స్, ఫార్మాసిటికల్ అనాలసిస్ విభాగాలలో ఒక్కొక్కటిలో 15 సీట్లు చొప్పున మొత్తం 45 సీట్లతో ఎం.ఫార్మసీ కోర్సు ప్రారంభం కానుందని వారు వెల్లడించారు.ఎంతోకాలంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇది శుభవార్త అని ఉపకులపతి పేర్కొన్నారు. ఇదే కళాశాలలో బీ.ఫార్మసీ అభ్యసించిన విద్యార్థులు ఇకపై మాస్టర్స్ చదువుకోవడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని వారు తెలిపారు.ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశ్వవిద్యాలయ అభివృద్ధికి తాము చేస్తున్న కృషిలో భాగంగా ఈ విద్యా సంవత్సరం లా కోర్స్, ఇంజనీరింగ్ కళాశాల మంజూరులు లభించిన సంగతి తెలిసిందని ఉమేష్‌కుమార్ గుర్తుచేశారు. వచ్చే విద్యా... - [కరీంనగర్-తిరుపతి ప్రత్యేక రైలు ప్రారంభం](https://prajatelangana.com/%e0%b0%95%e0%b0%b0%e0%b1%80%e0%b0%82%e0%b0%a8%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%aa%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b1%87/): ప్రజా తెలంగాణ – కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు కరీంనగర్-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు ప్రారంభం చేయనున్నట్లు రైల్వే శాఖ గురువారం ప్రకటించింది. జూలై 6 నుండి జూలై చివరివరకు ఈ రైలు నడిపించనున్నారు.వారానికి రెండుసార్లు నడుపుతారుఈ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం రాత్రి 7:45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 10:00 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. రిటర్న్ జర్నీలో సోమవారం సాయంత్రం 5:30కి కరీంనగర్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 8:25కి తిరుపతి చేరుకుంటుంది.కరీంనగర్ నుంచి తిరుపతికి నిత్యం రైలు నడిపించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ రైలు ద్వారా తిరుపతి వెళ్లే ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. గత నెల 22న కరీంనగర్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కూడా మరోసారి విజ్ఞప్తి చేశారు.ప్రయాణికుల... - [బాల కార్మికుల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు](https://prajatelangana.com/%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%95%e0%b1%81%e0%b0%b2-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b1%82%e0%b0%b2%e0%b0%a8%e0%b0%aa%e0%b1%88/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ : ప్రపంచ బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు బాల కార్మికుల నిర్మూలన కోసం ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. జడ్జి వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలని సూచించారు. చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు.ఎలాంటి చట్టపరమైన సమস్యలు ఉన్నా కూడా తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమం లో లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం :   పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: కలెక్టర్ పమేలా సత్పతి - [పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: కలెక్టర్ పమేలా సత్పతి](https://prajatelangana.com/%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5-%e0%b0%aa%e0%b0%be%e0%b0%a0%e0%b0%b6%e0%b0%be%e0%b0%b2/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ రూరల్ : అన్ని సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధంపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల పున:ప్రారంభ కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు పంపిణీ చేశారు. ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంతో వినూత్న కార్యక్రమాలు ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్, జిల్లాలో వినూత్న రీతిలో ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డెడ్‌ఎడ్, ఒలంపియాడ్, కంప్యూటర్ వంటి విభిన్న రంగాలతో పాటు క్రీడా పోటీల్లో కూడా విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు.ప్రభుత్వ పాఠశాలలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ,పుస్తకాలూ యూనిఫాం ఉచితంగా అందజేస్తూ పైసా ఖర్చు లేకుండా చదువుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బడిబాట కార్యక్రమంలో ఇంటింటికి పర్యటన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటిని సందర్శిస్తూ... - [విద్యార్థులకు నాణ్యమైన భోజనం తయారు చేయాలి - కలెక్టర్ పమేలా సత్పతి](https://prajatelangana.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%a8%e0%b0%be%e0%b0%a3%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8/): ప్రజాతెలంగాణ – రామడుగు : ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని తయారు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వంట చేసే సిబ్బందికి సూచించారు.మంగళవారం జిల్లాలోని అన్ని కేజీబీవీలు, బాలికల రెసిడెన్షియల్ హాస్టళ్లలో వంట చేసే 90 మంది సిబ్బందికి రామడుగు మండలం వెదిర గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి  హాజరై సిబ్బంది వంట చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. శిక్షణలో భాగంగా వంట సిబ్బంది తయారుచేసిన భోజనాన్ని రుచి చూశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వంట సిబ్బంది వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటిస్తూ వంటగది పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. వంట చేసేందుకు పరిశుభ్రమైన నీరు వాడాలని, నాణ్యతతో కూడిన భోజనం తయారు చేయాలని అన్నారు. డైట్ మెనూలో పేర్కొన్న విధంగా వివిధ రకాల పిండి వంటలు, పలహారం వంటివి రుచికరంగా చేయాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న ప్రకారం వంట చేయాలని సూచించారు. కేజీబీవీలలో... - [ఎస్ యూ ఆంగ్ల విభాగంలో డిజిటల్ క్లాస్‌రూమ్ ప్రారంభం](https://prajatelangana.com/%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%af%e0%b1%82-%e0%b0%86%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ad%e0%b0%be%e0%b0%97%e0%b0%82-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%9c%e0%b0%9f%e0%b0%b2/): ప్రజాతెలంగాణ – కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో ఆంగ్ల విభాగంలో డిజిటల్ క్లాస్‌రూమ్ ను మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సూరేపల్లి సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రిన్సిపాల్ సుజాత, “డిజిటల్ క్లాస్‌రూమ్ సాంకేతిక పరికరాలు, సాఫ్ట్‌వేర్‌లను వినియోగించి అత్యాధునిక విద్యను అందించే తరగతి గది. ఇది సాధారణ తరగతి గది కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ బోధన, అభ్యాసం డిజిటల్ పద్ధతిలో జరుగుతాయి” అని వివరించారు.డిజిటల్ క్లాస్‌రూమ్‌లో ఉపాధ్యాయులు స్మార్ట్ బోర్డులను ఉపయోగించి పాఠాలను, వీడియోలను చూపించి విద్యార్థులకు సౌకర్యవంతమైన బోధనను అందిస్తారని తెలిపారు. ఈ సదుపాయాలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అనేక ప్రయోజనాలను అందిస్తాయని, సాంకేతిక విప్లవానికి తోడ్పాటు చేస్తాయని అన్నారు.ఆంగ్ల విభాగాధిపతి విజయప్రకాష్ మాట్లాడుతూ, డిజిటల్ క్లాస్‌రూమ్‌ను అందించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేష్‌కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు సాంకేతికతపై అవగాహన పెంచుకుని ఆధునిక సదుపాయాలతో ఆంగ్ల భాషను నేర్చుకోవాలని,... - [జూన్ 30 వరకు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ](https://prajatelangana.com/%e0%b0%9c%e0%b1%82%e0%b0%a8%e0%b1%8d-30-%e0%b0%b5%e0%b0%b0%e0%b0%95%e0%b1%81-%e0%b0%ae%e0%b1%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2%e0%b0%b2-%e0%b0%b0%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d/): – అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ప్రజాతెలంగాణ- కరీంనగర్ : వర్షాకాలం నేపథ్యంలో వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తెలిపారు. ఈ కారణంగా జూన్ 30 వరకు రేషన్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటనలో వెల్లడించారు.ఆహార భద్రతా కార్డుదారులకు వ్యక్తికి ఆరు కిలోల చొప్పున, అంత్యోదయ కార్డుదారులకు నెలకు 35 కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డుదారులకు నెలకు 10 కిలోల చొప్పున మూడు నెలల బియ్యం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. అంత్యోదయ కార్డుదారులకు నెలకు ఒక కిలో చక్కెర చొప్పున మూడు నెలలకు పంపిణీ చేస్తామని, కిలోకు రూ.13.50 చెల్లించాలని అడిషనల్ కలెక్టర్ వెల్లడించారు. మరిన్ని వార్తల కోసం : ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తేనే పిల్లలకు బంగారు భవిష్యత్తు – సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి - [ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తేనే పిల్లలకు బంగారు భవిష్యత్తు - సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి](https://prajatelangana.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5-%e0%b0%aa%e0%b0%be%e0%b0%a0%e0%b0%b6%e0%b0%be%e0%b0%b2%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9a%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b5/): ప్రజాతెలంగాణ – కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉందని, పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సమక్షంలో నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు .సోమవారం శాంతినగర్‌లో జిల్లా విద్యాధికారి మొండయ్యతో కలిసి బడిబాట కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను గుర్తించాలని కోరారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మేధావులు, అన్ని రంగాలకు చెందిన వారిలో ఎక్కువ శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని వివరించారు.బడిబాట కార్యక్రమంలో భాగంగా స్వంత ప్రచార వాహనంతో ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరిస్తూ కొత్తగా చేరిన పది మంది విద్యార్థులకు ప్రోత్సాహకంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.చింతకుంట, శాంతినగర్, గాంధీనగర్ పాఠశాలల... - [ముగ్గురు అంతర్రాష్ట్ర సైబర్ మోసగాళ్ల అరెస్ట్](https://prajatelangana.com/cyber-police/): ప్రజాతెలంగాణ – కరీంనగర్, : జాబ్ ఆఫర్ల పేరుతో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడిన ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను కరీంనగర్ సైబర్ పోలీసులు  మహారాష్ట్రలో అరెస్ట్ చేశారు. బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్, రేటింగ్ రివ్యూ వర్క్, పార్ట్ టైం జాబ్స్ పేర్లతో బాధితుల నుండి మొత్తం ₹92 లక్షలు దోచుకున్న పూణే జిల్లా భోర్ తాలూకాకు చెందిన ప్రసాద్ సురేష్ గువహనే (26), చందన్ విట్టల్ గవనే (25), ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన శ్రేయస్ ముకుంద్ కలి (26) లను అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం వారిని రిమాండ్‌కు పంపింది.సైబర్ క్రైమ్ పోలీసుల వివరణ ప్రకారం నిందితులు లాభదాయకమైన ఆఫర్లతో ప్రజల నమ్మకాన్ని పొందిన తర్వాత బాధితుల బ్యాంక్ నుండి తమ ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారని తెలిపారు.కేవలం కరీంనగర్ జిల్లాలోనే రెండు కేసుల్లో ₹92 లక్షల మోసం చేసిన ఈ గ్యాంగ్‌పై ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక కేసులు... - [అంగన్వాడీ బాటకు సిద్ధం కావాలి- జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి](https://prajatelangana.com/%e0%b0%85%e0%b0%82%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1%e0%b1%80-%e0%b0%ac%e0%b0%be%e0%b0%9f%e0%b0%95%e0%b1%81-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%82/): అంగన్వాడీ బాటకు సిద్ధం కావాలి- డీ డబ్ల్యు ఓ ఎం. సరస్వతి ప్రజా తెలంగాణ -కరీంనగర్ : జూన్ 12 నుంచి 17 వరకు నిర్వహించనున్న అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీలో చేర్పించేందుకు మహిళా శిశు సంక్షేమ అధికారులు సిద్ధం కావాలని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి తెలిపారు.శుక్రవారం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సిడిపిఓలు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి మేధో మథన సదస్సులో మంత్రి అనసూయ సీతక్క పలు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.జిల్లాలోని 4 ఐసిడిఎస్ ప్రాజెక్టుల సిబ్బంది అంగన్వాడీ సేవలను బలోపేతం చేయాలని సూచించారు. పిల్లల్లో పోషణ లోపం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అంగన్వాడీలలో హాజరు శాతం పెంచాలని అన్నారు. తల్లిదండ్రులకు అంగన్వాడీలో అందిస్తున్న  ప్రాథమిక విద్య, నాణ్యమైన పోషకాహారం  గురించి  తెలియజేయాలని సూచించారు.అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేసిన పిల్లలను ప్రభుత్వ... - [బడిబాట విజయవంతం చేయాలి - కలెక్టర్ పమేలా సత్పతి](https://prajatelangana.com/%e0%b0%ac%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ac%e0%b0%be%e0%b0%9f-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af%e0%b0%b5%e0%b0%82%e0%b0%a4%e0%b0%82-%e0%b0%9a%e0%b1%87%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%95/): ప్రజా తెలంగాణ -కరీంనగర్ :  ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. జూన్ 6 నుండి 19 వరకు నిర్వహించనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బాల బాలికలను ప్రభుత్వ పాఠశాలల్లో, ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీల్లో చేర్పించేట్లు చూడాలని అన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లోని మెరుగైన సదుపాయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ర్యాలీలు, బ్యానర్లు, విద్యావాహిని వాహనాల ద్వారా డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించాలని అన్నారు.పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, నోట్ పుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు చేరాయని, పాఠశాల ప్రారంభ రోజే విద్యార్థులకు అందించాలని తెలిపారు. బాల కార్మికులను, 5-14 ఏళ్ల బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా విద్యాధికారి మొండయ్య,... - [బక్రీద్ పండగ ఏర్పాట్లకు కాంగ్రెస్ మైనారిటీ సెల్ వినతి పత్రం](https://prajatelangana.com/%e0%b0%ac%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%a6%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%82%e0%b0%a1%e0%b0%97-%e0%b0%8f%e0%b0%b0%e0%b1%8d%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b0%95%e0%b1%81/): ప్రజాతెలంగాణ-కరీంనగర్: ఈ నెల 7న జరగనున్న బక్రీద్ పండగ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దీన్ ఆధ్వర్యంలో  కలెక్టర్‌ పమేలా సత్పతి  ని  కలిసి వినతి పత్రం అందజేశారు.మూడు రోజుల పాటు జరుపుకునే బక్రీద్ పండగను పురస్కరించుకుని, నగరం మరియు జిల్లాలోని మూడు మునిసిపాలిటీలు, 14 మండలాల పరిధిలోని మసీదులు, ఈద్‌గాహ్‌లకు శానిటేషన్, వాటర్, కరెంటు సౌకర్యాలను కల్పించాలని కోరారు. పరిసర ప్రాంతాలను శుభ్రంగా నిర్వహించాలని కూడా అభ్యర్థించారు.పండగ రోజుల్లో మెడికల్ కేంపులు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని అభ్యర్థించారు. పార్కింగ్ వ్యవస్థ, మంచినీటి సదుపాయాలు కూడా కల్పించాలని విన్నపించారు. వాహనాల రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసుల సహకారం కోరారు.వినతి పత్రం అందజేసిన వారిలో కాంగ్రెస్ మైనారిటీ నేతలు సమద్ నవాబ్, నేహాల్ అహ్మద్, అబ్దుల్ రహీమాన్, మొహమ్మద్ కలిమోద్దీన్, ఫిరోజ్ ఆరిఫ్ ఖాన్, గౌస్ భాయ్, హనీఫ్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని... - [బక్రీద్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి - కలెక్టర్ పమేలా సత్పతి](https://prajatelangana.com/bakrid-arrangements-collector-pamela-sathpathi/): ప్రజాతెలంగాణ-కరీంనగర్ : జూన్ 7న వచ్చే బక్రీద్ పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలు పండుగ ఏర్పాట్లపై సూచనలు చేశారు.ఈద్గాల వద్ద అన్ని వసతులు కల్పించాలని, తాగునీరు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. నమాజ్ వేళల్లో కరెంటు కట్ లేకుండా చూడాలని ఆదేశించారు. మసీదుల వద్ద పరిశుభ్రత పాటించాలని, వేస్టేజ్ కవర్లు పంపిణీ చేయాలని తెలిపారు.సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు.అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఇతర అధికారులు, ముస్లిం ప్రతినిధులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం : రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి – కలెక్టర్ పమేలా సత్పతి - [రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి - కలెక్టర్ పమేలా సత్పతి](https://prajatelangana.com/revenue-camps-collector-bhubarathi/): ప్రజా తెలంగాణ – కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి కొత్త రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. భూ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడు ప్రాథమిక పాఠశాలలో, కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ అవగాహనా సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో విజయవంతమైన పైలెట్ ప్రాజెక్ట్ భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించిందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సైదాపూర్ మండలంలో, అన్ని మండల కేంద్రాలలో రెవెన్యూ అవగాహనా సదస్సులు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన భూ సమస్య అర్జీలను రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తున్నారని అన్నారు.జూన్ 20 వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు... - [ఉప కార్మిక కమిషనర్ గా కోల ప్రసాద్](https://prajatelangana.com/%e0%b0%89%e0%b0%aa-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%95-%e0%b0%95%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b7%e0%b0%a8%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%8d/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ : ఉప కార్మిక సహాయ శాఖ కార్యాలయంలో ఉప కార్మిక కమిషనర్ గా కోల ప్రసాద్ సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాదులో సహాయ కార్మిక కమిషనర్ గా విధులు నిర్వహించిన ప్రసాద్ పదోన్నతి పై కరీంనగర్ కార్మిక శాఖ కార్యాలయంలో విధులు చేరారు.ఈ సందర్భంగా ఉప కార్మిక కమిషనర్ ప్రసాద్ ను సహాయ కార్మిక కమిషనర్ ఎస్ వెంకటరమణ, సహాయ కార్మిక అధికారులు రఫీ మహమ్మద్, చక్రధర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్లు బి మనోజ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్లు మధుకర్ రావు, శ్రీకాంత్, దివ్య, వివిధ కార్మికుల సంఘాల నాయకులు సన్మానించి స్వాగతం పలికారు. మరింత : తెలంగాణను ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతాం – మంత్రి శ్రీధర్ బాబు - [తెలంగాణను ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతాం - మంత్రి శ్రీధర్ బాబు](https://prajatelangana.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b0%82%e0%b0%9a%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%85%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%97%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%a8%e0%b0%bf/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ : తెలంగాణను ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్-2047 విజన్‌తో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్‌లో మాట్లాడిన మంత్రి, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించామని, ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేశామని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో 25.35 లక్షల రైతులకు రూ. 20,617 కోట్ల రుణమాఫీ చేశామని, ఇది దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోతుందని వివరించారు. రైతుభరోసా కింద ఎకరానికి రూ. 12,000 సహాయం, ధాన్యం కొనుగోలు చేసిన... - [నవోదయ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం](https://prajatelangana.com/%e0%b0%a8%e0%b0%b5%e0%b1%8b%e0%b0%a6%e0%b0%af-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b1%82%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5%e0%b1%87%e0%b0%b6%e0%b0%be/): కరీంనగర్: దేశవ్యాప్తంగా ఉన్న 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు వివరాలు : ఐదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు లేదా ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుకుంటున్నారు. ప్రవేశ పరీక్ష తేదీలు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పర్వత ప్రాంత రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 11న పరీక్ష జరుగుతుంది. ప్రత్యేకతలు నవోదయ విద్యాలయాలు ఉచిత వసతి విద్యను అందిస్తాయి. గ్రామీణ ప్రాంతాల మేధావులకు నాణ్యమైన విద్యను అందించడమే ఈ స్కూళ్ల లక్ష్యం. సీబీఎసఈ పాఠ్యక్రమంతో త్రిభాషా విధానంలో బోధన జరుగుతుంది. దరఖాస్తు చేయడం ఎలా? https://cbseitms.rcil.gov.in/nvs/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు స్థానిక విద్యాధికారులను సంప్రదించవచ్చు. - [ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ](https://prajatelangana.com/%e0%b0%92%e0%b0%95%e0%b1%87%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2%e0%b0%b2-%e0%b0%b0%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%aa/): ప్రజాతెలంగాణ – కరీంనగర్: జూన్, జులై, ఆగష్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ముందస్తుగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ ప్రకటించింది.జూన్ 1 నుంచి 30 వరకు బియ్యం, చక్కెర పంపిణీ చేస్తామని తెలిపింది. ఇప్పుడు తీసుకోకపోతే తర్వాత సెప్టెంబర్‌లో మాత్రమే రేషన్ అందుతుందని వెల్లడించింది.ఒకేసారి మూడు నెలల రేషన్ లభించడం తో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే మూడు నెలల బియ్యం ఒకేసారి అందించడం తో పాటు ,సెప్టెంబర్ వరకు రేషన్ తీసుకునే అవకాశం ఉండకపోవడం తో మొదటి రోజే రేషన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది.ఈ సందర్బంగా తగు సమయంలో రేషన్ తీసుకోవాలని శాఖ విజ్ఞప్తి చేసింది. మరింత : నేటి ప్రజావాణి రద్దు   - [కౌన్సిలింగ్‌తో యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్](https://prajatelangana.com/%e0%b0%95%e0%b1%8c%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b0%bf%e0%b0%b2%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%af%e0%b1%81%e0%b0%b5%e0%b0%95%e0%b1%81%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%aa/): ప్రజా తెలంగాణ – కరీంనగర్ రూరల్: కొత్తపల్లి మండలం బావుపేటకు చెందిన నేరెళ్ల సన్నీ అలియాస్ దయాసాగర్ కుటుంబ సభ్యులతో గొడవపడిన తర్వాత కోపంతో ఆదివారం గ్రామంలోని వాటర్ ట్యాంక్‌పై ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న కానిస్టేబుల్ విజయరావు ఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంక్‌పై ఉన్న సన్నీతో ఓపికగా మాట్లాడుతూ కౌన్సిలింగ్ చేశాడు. యువకుడి అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి పరిస్థితిని చక్కదిద్దాడు.సంయమనంతో కౌన్సిలింగ్ చేసి యువకుడి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ విజయరావును కరీంనగర్ రూరల్ ఏసిపి శుభంప్రకాష్ నగ్రాల్, సిఐ నిరంజన్‌రెడ్డి, కొత్తపల్లి ఎస్‌ఐ సాంబమూర్తి అభినందించారు.   మరింత : కేంద్ర సహాయ మంత్రి చేతుల మీదుగా ఎలైట్ వరల్డ్ స్కూల్ ప్రారంభం - [కేంద్ర సహాయ మంత్రి చేతుల మీదుగా ఎలైట్ వరల్డ్ స్కూల్ ప్రారంభం](https://prajatelangana.com/%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%b8%e0%b0%b9%e0%b0%be%e0%b0%af-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%8e%e0%b0%b2%e0%b1%88%e0%b0%9f%e0%b1%8d/): ప్రజాతెలంగాణ -కరీంనగర్ : కరీంనగర్ పట్టణం లోని కోతిరాంపూర్‌లో గల ఎలైట్ వరల్డ్ స్కూల్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం పాఠశాల నిర్వాహకుల సమక్షంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్య, శ్రేష్ఠత మరియు సాధికారతలో పరివర్తనాత్మక ప్రయాణానికి ఈ పాఠశాల ప్రారంభం నాంది అవుతుందని అభిప్రాయపడ్డారు.స్కూల్ కరెస్పాండెంట్ సుదగోని సంతోష్ మాట్లాడుతూ, కేంద్ర సహాయ మంత్రి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా పాఠశాలను ప్రారంభించుకోవడం తమకు ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు.అత్యున్నత ప్రమాణాలతో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో నర్సరీ నుంచి ఏడవ తరగతి వరకు స్టేట్ సిలబస్‌తో పాటు సీబీఎస్‌ఈ విద్యా విధానంలో బోధనా తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.విద్యార్థులను నేటి కాలపు సవాళ్లను ఎదుర్కొనేలా తయారుచేయడమే తమ ప్రధాన లక్ష్యమని సంతోష్ స్పష్టంచేశారు. అడ్మిషన్లకు సంబంధించిన వివరాలకు 9491818484 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. మరింత : నేటి ప్రజావాణి రద్దు - [నేటి ప్రజావాణి రద్దు](https://prajatelangana.com/%e0%b0%a8%e0%b1%87%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%be%e0%b0%b5%e0%b0%be%e0%b0%a3%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%81/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్‌లో నేడు (02.06.2025) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మరింత : జూన్ 10లోగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ భవనాలకు మార్చాలి – అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్   - [నేడే ఎలైట్ వరల్డ్ స్కూల్ ప్రారంభం](https://prajatelangana.com/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a1%e0%b1%87-%e0%b0%8e%e0%b0%b2%e0%b1%88%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%b0%e0%b0%b2%e0%b1%8d%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b1%82%e0%b0%b2%e0%b1%8d/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయంగా ,అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఎలైట్ వరల్డ్ స్కూల్ నేడే ప్రారంభిస్తున్నట్లు పాఠశాల కరెస్పాండెంట్ సుదగోని సంతోష్ ఒక ప్రకటన లో తెలిపారు.నర్సరీ నుండి 10 వ తరగతి వరకు స్టేట్ సిలబస్ తో పాటు ,సీబీఎస్ఈ విద్యా విధానంలో ఉత్తమమైన,అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధనా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా పలువురు విచ్చేయనున్నట్లు పేర్కొన్నారు. సమాజ నిర్మాణం లో విద్య ప్రముఖ పోషిస్తుందని,నేటి బాలలే రేపటి పౌరులన్నారు. ఈ కార్యక్రమానికి అందరు విచ్చేసి విజయవంతం చెయ్యాలని కోరారు.అడ్మిషన్ సంబంధిత వివరాల కోసం 9491818484 లో సంప్రదించాలని తెలిపారు . మరిన్ని వార్తల కోసం : జూన్ 1న ఎలైట్ వరల్డ్ స్కూల్ ప్రారంభం : పాఠశాల కరెస్పాండెంట్ సుదగోని సంతోష్ - [పొగాకు వ్యతిరేక దినోత్సవం పై అవగాహన సదస్సు](https://prajatelangana.com/%e0%b0%aa%e0%b1%8a%e0%b0%97%e0%b0%be%e0%b0%95%e0%b1%81-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%87%e0%b0%95-%e0%b0%a6%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b5/): ప్రజాతెలంగాణ – కరీంనగర్: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేష్ ఆధ్వర్యంలో సీతారాంపురంలోని జిల్లా సెంట్రింగ్ ఓనర్స్ సొసైటీ భవనంలో అవగాహన సదస్సు నిర్వహించారు.పొగాకు వాడకం వల్ల ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుందని, క్యాన్సర్‌కు పొగాకు వాడకం ముఖ్య కారణమని తెలిపారు. బహిరంగంగా పొగ త్రాగడం నేరమని, దీనికి జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం కూడా నేరమని చెప్పారు.ఈ సందర్భంగా హాజరైన కార్మికులతో పొగాకు వాడకం నిర్మూలించేందుకు ప్రతిజ్ఞ చేపట్టారు. ఏ విధమైన చట్టపరమైన సమస్య తలెత్తినా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్, జేఏసీ అధ్యక్షుడు కన్నం లక్ష్మన్, వివిధ సంఘాల అధ్యక్షులు నారాయణ, మీస రాజయ్య, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. మరింత :జూన్ 10లోగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ... - [సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి](https://prajatelangana.com/seasonal-diseases-control-district-collector-pamela-sathpathi/): ప్రజాతెలంగాణ – కరీంనగర్: వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.శనివారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశంలో మాట్లాడిన కలెక్టర్, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని, నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ముఖ్యంగా తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టి నీటి నమూనాలను పరీక్షించి క్లోరినేషన్ చేయాలని అన్నారు. గత సంవత్సరం ఎక్కువ వ్యాధులు ప్రబలిన గ్రామాలు, వార్డులను గుర్తించి జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. డెంగీ కేసులు నమోదు అయితే ఆ ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.  వనమహోత్సవం విజయవంతం చేయాలి జిల్లాలో అనువైన ప్రదేశాల్లో మొక్కలు నాటి వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. జూన్ మొదటి వారం నుండి పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృతంగా మొక్కలు... - [రాజ్‌కుమార్‌కు ఘన విరమణ సన్మానం](https://prajatelangana.com/%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b1%8d%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b1%81-%e0%b0%98%e0%b0%a8-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b0%e0%b0%ae%e0%b0%a3/): ప్రజాతెలంగాణ -కరీంనగర్ : సమాచార , పౌర సంబంధాల శాఖ లో జూనియర్ అసిస్టెంట్ గ సేవలందిస్తున్న దామ రాజ్‌కుమార్‌కు శనివారం కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీలో ఘన విరమణ సన్మానం జరిగింది.అసిస్టెంట్ డైరెక్టర్ జి.లక్ష్మణ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ, గత 36 సంవత్సరాలుగా అంకితభావంతో విధులు నిర్వర్తించిన రాజ్‌కుమార్ అధికారులు, ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. సమాచార శాఖలో పని చేయడం వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే అవకాశం లభిస్తుంది. రాజ్‌కుమార్ వృత్తి నిబద్ధతతో సౌమ్యుడిగా, వివాద రహితుడిగా తన పనిని చేసుకున్నారు” అని లక్ష్మణ్‌కుమార్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ జేఆర్‌ఈ ఉషారాణి, రిటైర్డ్ సీఐఏ సత్యనారాయణ, డిప్యూటీ ఇంజనీర్ నర్సింగ్‌రావు, రిటైర్డ్ అధికారులు పూర్ణచంద్రు, కనకయ్య, భూమయ్య, కార్యాలయ సిబ్బంది శ్రీధర్, శివాని, చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు. మరింత :జూన్ 10లోగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ భవనాలకు మార్చాలి – అడిషనల్ కలెక్టర్... - [జూన్ 10లోగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ భవనాలకు మార్చాలి - అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్](https://prajatelangana.com/anganwadi-centres-govt-school-additional-collector/): ప్రజా తెలంగాణ – కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో అద్దె భవనాల్లో నడుస్తున్న అన్ని అంగన్వాడీ కేంద్రాలను జూన్ 10లోగా తప్పనిసరిగా ప్రభుత్వ భవనాలకు మార్చాలని అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు.శనివారం స్థానిక సుడా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో చర్చించిన అడిషనల్ కలెక్టర్, ఇదివరకే 63 కేంద్రాలను మార్చినట్లు వెల్లడించారు. అద్దె భవనాల్లోని అంగన్వాడీలను ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు లేదా ప్రభుత్వ భవనాలకు మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఆలస్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పాఠశాలలకు అంగన్వాడీలను మార్చిన తర్వాత అవసరమైన వసతులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని దేశాయ్ సూచించారు. అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని, మరమ్మతులు చేయిస్తామని భరోసా ఇచ్చారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వెటర్నరీ సెంటర్లు సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో... - [ఎస్‌యూలో చరిత్ర, టూరిజం విభాగాలు ఏర్పాటు చేయాలి - చరిత్ర పరిరక్షణ సమితి](https://prajatelangana.com/su-history-tourism-history-protection-committee/): కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయంలో చరిత్ర, టూరిజం విభాగాలు ఏర్పాటు చేయాలని కోరుతూ  చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ నాయకులు  శుక్రవారం రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్‌ను కలిసిన  వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో శాతవాహనుడి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కోరారు.ఈ సందర్బంగా రిజిస్ట్రార్  విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శాతవాహనుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారని తొందరలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని,వచ్చే విద్యా సంవత్సరం నుండి చరిత్ర మరియు టూరిజం విభాగాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు చరిత్ర పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. సమితి రాష్ట్ర అధ్యక్షులు డా. పోతరవేణి తిరుపతి, వ్యవస్థాపకులు డా. సందవేణి తిరుపతి, కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గుజ్జెటి తిరుపతి పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం : జూన్ 1న ఎలైట్ వరల్డ్ స్కూల్ ప్రారంభం : పాఠశాల కరెస్పాండెంట్ సుదగోని సంతోష్ - [పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం](https://prajatelangana.com/mla-medipally-satyam-distribution-indiramma-indlu-proceedings/): – గంగాధర మండలంలో 468 మందికి మంజూరు ఉత్తర్వులు అందజేత ప్రజాతెలంగాణ-గంగాధర : పారదర్శకంగా, పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుపుతున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.జీవీఆర్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం 468 మంది లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అందజేశారు.గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని మేడిపల్లి సత్యం విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడి కలను సాకారం చేస్తోందని తెలిపారు.గంగాధర మండలంలో మొత్తం 721 మందికి మొదటి దఫాలో ఇళ్లు మంజూరయ్యాయని,  కురిక్యాల గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా 200 మందికి ఇళ్లు నిర్మాణం జరుగుతోందన్నారు .గంగాధర మండలానికి సంబంధించి గత సర్కారు కేవలం 17 కోట్లు రుణమాఫీ మాత్రమే చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 48 కోట్లు రుణమాఫీ చేసిందని తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అమలు చేస్తున్నామని అన్నారు.త్వరలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్... - [జూన్ 1న ఎలైట్ వరల్డ్ స్కూల్ ప్రారంభం : పాఠశాల కరెస్పాండెంట్ సుదగోని సంతోష్](https://prajatelangana.com/elite-world-school-inauguration-june-1st/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయంగా ,అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఎలైట్ వరల్డ్ స్కూల్ జూన్ 1,ఆదివారం రోజున కోతిరాంపూర్ లో ప్రారంభిస్తున్నామని పాఠశాల కరెస్పాండెంట్ సుదగోని సంతోష్ ఒక ప్రకటన లో తెలిపారు.నర్సరీ నుండి 10 వ తరగతి వరకు స్టేట్ సిలబస్ తో పాటు ,సీబీఎస్ఈ విద్యా విధానంలో ఉత్తమమైన,అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధనా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా పలువురు విచ్చేయనున్నట్లు పేర్కొన్నారు. సమాజ నిర్మాణం లో విద్య ప్రముఖ పోషిస్తుందని,నేటి బాలలే రేపటి పౌరులన్నారు. ఈ కార్యక్రమానికి అందరు విచ్చేసి విజయవంతం చెయ్యాలని కోరారు.అడ్మిషన్ సంబంధిత వివరాల కోసం 9491818484 లో సంప్రదించాలని తెలిపారు . మరిన్ని వార్తల కోసం : దేశ చరిత్రలోనే వరి సాగులో తెలంగాణ నంబర్ వన్ -ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి   - [దేశ చరిత్రలోనే వరి సాగులో తెలంగాణ నంబర్ వన్ -ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి](https://prajatelangana.com/%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%be%e0%b0%97%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%a8%e0%b0%82%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d-1/): ప్రజాతెలంగాణ- వెబ్ డెస్క్  :  గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పండని విధంగా అత్యధికంగా దేశ చరిత్రలోనే తెలంగాణ వరి సాగులో నంబర్ వన్ గా నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.యాసంగీ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ధాన్యం సాగు జరగలేదని మంత్రి తెలిపారు. కాలేశ్వరం ,సుందిళ్ల ,అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల నుంచి చుక్క నీరు రాకున్నా అధికారుల సహకారం, ప్రభుత్వం చేపట్టిన పకడ్బందీ చర్యల వల్ల అత్యధికంగా వరి సాగైందని పేర్కొన్నారు. రైతుల కొనుగోలులో రికార్డు 28 మే నాటికి యాసంగి పంట కొనుగోలు కోసం రైతులకు రాష్ట్రంలో దాదాపు 13 వేల కోట్లు చెల్లించామని, గత ప్రభుత్వ హయాంలో ఇదే... - [లేక్ పోలీస్ ఇంచార్జ్‌గా ఆర్.ఎస్సై రమేష్ నియామకం](https://prajatelangana.com/lake-police-incharge-lmd/): ప్రజాతెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన లేక్ పోలీస్ అవుట్ పోస్ట్‌కు ఆర్.ఎస్సై రమేష్‌ని ఇంచార్జ్‌గా నియమించారు. ఈ మేరకు గురువారం పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆర్.ఎస్సై రమేష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. డ్యామ్ పరిసరాల్లో నిఘా పటిష్టం చేసి, ప్రజలు సురక్షితంగా విహరించే వాతావరణాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వార్తల కోసం : ఎస్ యూ ఎల్‌ఎల్‌బి పరీక్షల షెడ్యూల్ విడుదల   - [ఎస్ యూ ఎల్‌ఎల్‌బి పరీక్షల షెడ్యూల్ విడుదల](https://prajatelangana.com/su-llb-exams-iv-sem-vi-sem-shedule/): – 4 వ సెమిస్టరు బ్యాక్‌లాగ్‌లకు వన్ టైం ఛాన్స్ ప్రజా తెలంగాణ- కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్‌ఎల్‌బి కోర్సుకు సంబంధించిన పరీక్షల ప్రణాళిక ను పరీక్షల నియంత్రణ అధికారి డా. డి. సురేష్‌కుమార్ గురువారం వెల్లడించారు. ఎల్‌ఎల్‌బి ఆరవ సెమిస్టర్ పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభమై జూన్ 11న ముగుస్తాయని తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవ్వాలని సూచించారు.4 వ సెమిస్టరు బ్యాక్‌లాగ్ పరీక్షలకు ఈ సారి ప్రత్యేకంగా వన్ టైం ఛాన్స్ కల్పిస్తున్నామని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి పేపర్‌కు రూ. 1,500 చొప్పున రుసుము చెల్లించాలని స్పష్టం చేశారు.మరిన్ని వివరాలకు సంబంధిత కళాశాలలను సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను సందర్శించాలని డా. సురేష్‌కుమార్ సూచించారు. మరిన్ని వార్తల కోసం : ఎస్ యూ పరిధిలో దోస్త్ మొదటి విడత కేటాయింపులు పూర్తి - [ఎస్ యూ పరిధిలో దోస్త్ మొదటి విడత కేటాయింపులు పూర్తి](https://prajatelangana.com/su-dost-first-phase-admissions-sri-ranga-prasad/): ప్రజా తెలంగాణ – కరీంనగర్ : ఎస్ యూ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో దోస్త్ ప్రవేశాల మొదటి విడత సీట్ కేటాయింపుల ప్రక్రియ పూర్తయిందని విశ్వవిద్యాలయ దోస్త్ కోఆర్డినేటర్ డా. ఎన్.వి. శ్రీరంగప్రసాద్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. మొత్తం 36,540 సీట్లకు నిర్వహించిన ఈ ప్రక్రియ లో మొదటి విడత కేటాయింపుల్లో కేవలం 5,931 సీట్లు మాత్రమే కేటాయించబడ్డాయని ఇంకా 30,609 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. 13 ప్రభుత్వ కళాశాలల్లో 297 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయని, 3 ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలల్లో 2,047 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారని వెల్లడించారు. అలాగే 60 ప్రైవేటు కళాశాలల్లో 3,587 మంది విద్యార్థులకు అవకాశం లభించిందని తెలిపారు.మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 6, 2025 లోపుగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్లను రిజర్వ్ చేసుకోవాలని , గడువులోపు రిపోర్టింగ్ చేయకపోతే సీట్ రిజిస్ట్రేషన్... - [రాజీవ్ యువ వికాసం యూనిట్లకు పటిష్ట కార్యాచరణ - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క](https://prajatelangana.com/rajiv-yuva-vikasam-deputy-cm-bhatti-vikramarka/): – జూన్ 2న లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ ప్రజాతెలంగాణ- వెబ్ డెస్క్ : రాజీవ్ యువ వికాసం పథకం క్రింద లాభసాటి వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్కు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథక పురోగతిని సమీక్షించిన ఆయన , 8 వేల కోట్ల పెట్టుబడితో 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కార్పొరేషన్ ద్వారా మొక్కుబడిగా పథకాలు అమలు చేశాయని ,తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో యువతకు స్వయం ఉపాధి కల్పిస్తుందన్నారు. యువత వ్యాపారం చేసి లాభం పొందాలని, ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా పెట్టుబడిని కలెక్టర్లు రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని సూచించారు. రాష్ట్ర జీడిపి వృద్ధిలో ఈ పథకం భాగస్వామ్యం కావాలని డిప్యూటీ సీఎం అన్నారు. మంజూరైన యూనిట్ల పనితీరు... - [భారత్ చారిత్రక వృద్ధి: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ!](https://prajatelangana.com/indain-historical-growth-world-no-1-economy/): – సవాళ్లు, అవకాశాల మధ్య వినూత్న ప్రస్థానం ప్రజా తెలంగాణ – న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఏప్రిల్ 2025 వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదిక ప్రకారం, 2025 చివరి నాటికి భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. నామమాత్రపు స్థూల జాతీయోత్పత్తి (Nominal GDP) పరంగా జపాన్‌ను అధిగమించి ఈ ఘనతను సాధించబోతోంది. ఒక దశాబ్దం క్రితం, అంటే 2014లో ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, ఇప్పుడు అగ్రస్థానాల దిశగా వేగంగా అడుగులు వేయడం ఆర్థిక నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ పదేళ్ల కాలంలో దేశ నామమాత్రపు GDP రెట్టింపు కంటే ఎక్కువైంది. FY 2025-26 నాటికి $4 ట్రిలియన్లను అధిగమించగలదని అంచనా. ప్రపంచ సంక్షోభంలోనూ దూసుకుపోతున్న భారత్ :  భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, సరఫరా గొలుసు అంతరాయాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, ట్రంప్-యుగం... - [కరీంనగర్‌లో ఆటో యూనియన్ నాయకుల ముందస్తు అరెస్టు](https://prajatelangana.com/auto-drivers-preventive-arrest/): ప్రజా తెలంగాణ -కరీంనగర్ : హైదరాబాదులో ఆటో డ్రైవర్ల ఆకలి కేకలు మహాసభ జరుగుతున్న సందర్భంలో కరీంనగర్‌లోని ఆటో యూనియన్ కార్మిక సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.అరెస్టు చేసిన వారిలో కరీంనగర్ జిల్లా బీఆర్టీయు జిల్లా అధ్యక్షులు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్ ఉన్నారు. ఆటో యూనియన్ సభ్యులు, పలువురు విచ్చేసి సంఘీభావం తెలిపారు.ఈ సందర్బంగా బీఆర్టీయు అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చెయ్యాలని , సభలు చేయడానికి ఆటో డ్రైవర్లను అడ్డుకోకుండా తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు . లేకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని కొనసాగించవలసి వస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో... - [తిమ్మాపూర్‌లో నేర సమీక్ష నిర్వహించిన సీపీ గౌస్ ఆలం](https://prajatelangana.com/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0-%e0%b0%b8%e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%8d/): ప్రజాతెలంగాణ- తిమ్మాపూర్ : కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ మంగళవారం తిమ్మాపూర్ పోలీస్ సర్కిల్‌లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను సమర్థవంతంగా అమలు చేసి, సీసీసీ ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌లు పోలీస్ స్టేషన్‌లను తరచుగా సందర్శించి ఎస్సైల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి నెలా స్టేషన్ వారీగా నేర సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఆకస్మిక పరిస్థితులకు లాఠీ, హెల్మెట్ వంటి రైట్ గేర్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఎస్‌హెచ్‌ఓలు స్టేషన్ మేనేజ్‌మెంట్‌ను సక్రమంగా నిర్వహించి, రికార్డుల నిర్వహణ, కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో నవీకరించాలని అన్నారు. దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.డివిజన్‌లను సెక్టార్లుగా విభజించి ఏఎస్సై లేదా హెడ్ కానిస్టేబుల్‌లను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించాలని సూచించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గంజాయి, అక్రమ ఇసుక, పిడిఎస్ బియ్యం రవాణా,... - [జిల్లా విద్యాధికారి పై వేటు](https://prajatelangana.com/deo-surrender-collector-pamela-sathpathi/): ప్రజాతెలంగాణ- కరీంనగర్ : ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను జిల్లా విద్యాధికారి జనార్దన్ రావును ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా విద్యాధికారిగా డైట్ కళాశాల ప్రిన్సిపాల్ మొండయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరిన్ని వార్తల కోసం : ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి – సీఎం రేవంత్ రెడ్డి - [ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ](https://prajatelangana.com/dmho-venkata-ramana-karimnagar-health-centre/): ప్రజాతెలంగాణ- కరీంనగర్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మంగళవారం పిఓఎంసి హెచ్ డాక్టర్ సనజవేరియాతో కలిసి కట్టరాంపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, పద్మనగర్ బస్తీ దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య కేంద్రాలలోని హాజరు పట్టిక, అవుట్ పేషెంట్ విభాగం, లేబరేటరీ, ఫార్మసీ స్టోర్లలోని మందుల నిల్వలు మరియు రికార్డులను పరిశీలించారు.13 సంవత్సరాల పైబడిన మహిళలందరికీ ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంపులలో 100% స్క్రీనింగ్ పూర్తి చేయాలని సూచించారు. షుగర్ వ్యాధి మరియు అధిక రక్తపోటు నిర్ధారణ అయిన వారందరికీ ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా లభించే మందులను వాడేలా ప్రోత్సహించాలని అన్నారు.కట్టరాంపూర్లోని ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంపుకు వచ్చిన మహిళలతో అందుతున్న ఆరోగ్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కట్టరాంపూర్ పట్టణ కేంద్ర సిబ్బందితో సమావేశం నిర్వహించి రానున్న వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్తల గురించి చర్చించారు. మే... - [ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి - సీఎం రేవంత్ రెడ్డి](https://prajatelangana.com/implementation-govt-schemes-cm-revanth-reddy-video-conference/): ప్రజా తెలంగాణ – వెబ్ డెస్క్ : ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వ్యవసాయ శాఖ కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు.గత సంవత్సరం కంటే 22 లక్షల మెట్రిక్ టన్నుల అధికంగా మొత్తం 64.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సీఎం తెలిపారు. 10.5 లక్షల మంది రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి, 48 గంటల్లో చెల్లింపులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అసత్య ప్రచారాలను తిప్పికోట్టాలని, రైస్ మిల్లుల పర్యవేక్షణ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 పరిహారం అందించేందుకు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వానాకాలం సాగుకు రైతులకు అవసరమైన విత్తనాలు, యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు... - [నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలి - డీఎంహెచ్‌ఓ వెంకటరమణ](https://prajatelangana.com/%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b0%e0%b1%80%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a4/): ప్రజాతెలంగాణ- కరీంనగర్ : అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మొదటి కాన్పుల్లో గర్భవతులను సాధారణ డెలివరీ కోసం ప్రోత్సహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు .సోమవారం ఆయన అధ్యక్షతన మహిళా సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశం లో  మాట్లాడుతూ గైనకాలజీ డాక్టర్ చేత హెల్త్ చెకప్ చేయిస్తూ సిజేరియన్ డెలివరీల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను గర్భిణీలకు తెలియజేయాలని సూచించారు.30 సంవత్సరాలకు మించిన వారందరికీ అధిక రక్తపోటు, షుగర్ పరీక్షలు చేసి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా ప్రభుత్వ మందులు అందజేయాలని తెలిపారు. తీవ్ర పోషకాహార లోపం కలిగిన పిల్లలను గుర్తించి పోషకాహార పునరావాస కేంద్రానికి పంపించాలని సూచించారు. అంతర్జాతీయ రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా పిఓడిటి డాక్టర్ ఉమాశ్రీ రెడ్డి మాట్లాడుతూ, కౌమారదశ ఆడపిల్లలకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలని అన్నారు. రుతుస్రావ సమయంలో రోజుకు రెండుసార్లు ప్యాడ్లను మార్చుకోవాలని, శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలని సూచించారు. వాడిన శానిటరీ ప్యాడ్లను... - [బహిరంగ ప్రదేశంలో జూదం: ఐదుగురు అరెస్ట్](https://prajatelangana.com/%e0%b0%ac%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b0%e0%b0%82%e0%b0%97-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9c%e0%b1%82%e0%b0%a6%e0%b0%82-%e0%b0%90%e0%b0%a6/): ప్రజాతెలంగాణ -కరీంనగర్ రూరల్ : మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వేగురుపల్లి గ్రామంలో బహిరంగ ప్రదేశంలో అక్రమంగా జూదం ఆడుతున్న ఐదుగురిని సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.10,460 నగదు మరియు పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేయబడిన వారిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తము మానకొండూరు పోలీస్ స్టేషన్‌కు అప్పగించడం జరిగిందని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ తెలిపారు. జూదం, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరిన్ని వార్తల కోసం : బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు – రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి - [బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు - రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి](https://prajatelangana.com/belt-shops-abolition-rural-ci-niranjan-reddy/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్ : బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి హెచ్చరించారు . సోమవారం కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లోని బెల్ట్ షాపు నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 24 గంటలూ తెరిచి ఉండే బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా అమ్ముడవుతోందన్నారు . దీని వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని ,మద్యం సేవించిన వారు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, కొందరు గంజాయికి కూడా బానిసలవుతున్నారని సీఐ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిలో గొడవలు పెరుగుతున్నాయని, దీని వల్ల పోలీస్ కేసులు అధికమవుతున్నాయని వివరించారు.తల్లిదండ్రులు పిల్లలను చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని, సెల్ ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గ్రామాలు ఆరోగ్యంగా ఉండాలంటే బెల్ట్ షాపులు ఉండకూడదని, ప్రజలందరూ ఐకమత్యంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఎవరైనా బెల్ట్ షాపులు నడిపినట్లు రుజువైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,... - [తెలంగాణను సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించడమే లక్ష్యం- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు](https://prajatelangana.com/itminister-telangana-sridhar-babu-thaanacon/): ప్రజాతెలంగాణ -కరీంనగర్: తెలంగాణను సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించేందుకు విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు .కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో తెలంగాణ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తానాకాన్’ 11వ వార్షిక సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.వైద్యం సేవా దృక్పథంతో కూడినదని, వైద్యులు సమాజ శ్రేయస్సు కోరుకుంటారని , వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆరోగ్య మంత్రి దామోదర్‌రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, అనుమతులు, లైసెన్స్ సంబంధిత సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, వైద్యుల సూచనలను జిల్లా కలెక్టర్లతో చర్చించి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ భారీ మార్పులు తీసుకువస్తున్నదని వివరించారు. అన్ని వర్గాలకు విద్యా సదుపాయాలు అందేలా నూతన విధానాలను అమలు చేస్తున్నామని, ప్రభుత్వ... - [ముగిసిన గ్రామ పాలన అధికారుల నియామక పరీక్ష](https://prajatelangana.com/vro-vra-gpo-exam-collector-pamela-sathpathi/): – పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజాతెలంగాణ-కరీంనగర్ :  గ్రామాల్లో రెవెన్యూ సేవల పునరుద్ధరణ కోసం ఆదివారం నిర్వహించిన గ్రామ పాలన అధికారుల (జిపిఓ) నియామక పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ సప్తగిరి కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి లెక్టర్ సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో, వీఆర్ఏ పోస్టులను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే . ఈ మేరకు జిపిఓ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వీఆర్వో, వీఆర్ఏలకు రాత పరీక్ష నిర్వహించారు.పరీక్షకు మొత్తం 189 మంది వీఆర్వో, వీఆర్ఏలు దరఖాస్తు చేసుకోగా, వారిలో 172 మంది పరీక్ష రాశారు . కలెక్టర్ పరీక్ష కేంద్రంలో అధికారులతో మాట్లాడి అభ్యర్థుల వివరాలను తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, డిఆర్వో పవన్... - [ఎంఆర్బీ ఇటుక బట్టిలో అధికారుల తనిఖీలు](https://prajatelangana.com/%e0%b0%8e%e0%b0%82%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ac%e0%b1%80-%e0%b0%87%e0%b0%9f%e0%b1%81%e0%b0%95-%e0%b0%ac%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%85%e0%b0%a7%e0%b0%bf/): ప్రజా తెలంగాణ – కరీంనగర్ రూరల్ : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే వెంకటేష్ , అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రఫీ ఆధ్వర్యంలో చింతకుంట గ్రామంలోని ఎంఆర్బీ ఇటుక బట్టి లో  తనిఖీ నిర్వహించారు.తనిఖీ సమయంలో పనిచేస్తున్న కార్మికులకు అందుతున్న జీతభత్యాలు మరియు వారి సమస్యల గురించి వివరంగా తెలుసుకున్నారు. కార్మికులకు లభిస్తున్న సౌకర్యాల గురించి కూడా పరిశీలించారు. కార్మికులకు వారి హక్కులను కాపాడుకోవడం గురించి అవగాహన కల్పించారు. కార్మికులకు ఏ విధమైన చట్టపరమైన సమస్య తలెత్తినా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో  లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ ,సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం : అత్యాధునిక వైద్యానికి కేరాఫ్ ప్రభుత్వాసుపత్రులు – జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి - [అత్యాధునిక వైద్యానికి కేరాఫ్ ప్రభుత్వాసుపత్రులు - జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి](https://prajatelangana.com/govt-hospitals-synonym-for-quality-collector-pamela-sathpathi/): ప్రజా తెలంగాణ – కరీంనగర్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వీటిని వినియోగించుకునేలా వైద్యాధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.శుక్రవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య శాఖ పనితీరు మరియు మాతృ శిశు సంక్షేమ చర్యలపై సమీక్ష నిర్వహించారు.ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. ఆసుపత్రులను ఇంటిలా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ప్రజలు వస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యాధునిక వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకునేలా మరింత అవగాహన కల్పించాలని సూచించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా అసంక్రమిత వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మందులను క్రమం తప్పకుండా అందించాలని ఆదేశించారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. డెంగూ, మలేరియా నియంత్రణకు మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.ఆరోగ్య... - [లీగల్ సెల్ కమిటీని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ](https://prajatelangana.com/congrees-legalcell-chairman-ashokgoud-kallepally-lakshmaiah/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లీగల్ సెల్ కమిటీని విస్తరిస్తూ  రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని జిల్లా చైర్మన్ కల్లేపల్లి లక్ష్మయ్య బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.కొత్తగా నియమితులైన వారిలో జిల్లా వైస్ చైర్మన్లుగా కొత్త నరసింహారెడ్డి, చల్ల వెంకటరమణారెడ్డి, బొడ్డు రాజు, ఎండి చాంద్, మల్యాల ప్రతాప్లు ఉన్నారు. అదేవిధంగా కన్వీనర్లుగా గసిగంటి కొమురయ్య, జేరిపోతుల మహేందర్లను నియమించగా, జాయింట్ కన్వీనర్లుగా గడ్డం అవినాష్ రెడ్డి, ఆడెపు గౌతమ్ రాజు, తాండ్ర భూమేశ్వర్లకు బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని వార్తల కోసం : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి – కలెక్టర్ పమేలా సత్పతి   - [పేకాటరాయుళ్ల అరెస్టు](https://prajatelangana.com/%e0%b0%aa%e0%b1%87%e0%b0%95%e0%b0%be%e0%b0%9f%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b1%81%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%85%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81/): – రూ. 3.65 లక్షల నగదు ,14 సెల్ ఫోన్లు స్వాధీనం ప్రజాతెలంగాణ -కరీంనగర్ క్రైమ్ :కరీంనగర్ రూరల్ పరిధిలోని రేకుర్తిలోని పేకాట స్థావరంపై బుధవారం సీఐ ఏ. నిరంజన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు దాడి చేసి 13 మందిని అరెస్టు చేశారు. వారి నుండి రూ. 3,65,760 నగదు, 14 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా సి ఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నిందితులపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశామని , త్వరలో కోర్టులో చార్జిషీటు దాఖలు చేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వార్తల కోసం : భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం - [రాజీ కేసుల పరిష్కారానికి చర్యలు](https://prajatelangana.com/lokadalat-cp-meets-district-principal-judge/): కరీంనగర్ పోలీస్ కమిషనర్-ప్రిన్సిపల్ జడ్జి సమావేశం ప్రజా తెలంగాణ – న్యాయ వార్తలు :  కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఎస్. శివకుమార్‌ను బుధవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 14న జరగనున్న లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న రాజీపడే కేసులను కోర్టుల వారీగా పరిష్కరించాలని ఈ సందర్భంగా కమిషనర్ జడ్జిని కోరారు. సమన్వయ సమావేశంలో పెండింగ్ కేసుల సమీక్ష లోక్ అదాలత్ సన్నద్ధతలో భాగంగా, బుధవారం కోర్టు ఆవరణలోని మీటింగ్ హాలులో సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సెక్రటరీ వెంకటేష్ ఆధ్వర్యంలో కమిషనరేట్‌లోని పోలీస్ స్టేషన్ల ఎస్.హెచ్.ఓ.లతో సమన్వయ సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉండి, రాజీపడిన కేసుల వివరాలను చర్చించారు. కక్షిదారులు మరియు ఫిర్యాదుదారులు రాజీపడే కేసులను రానున్న లోక్ అదాలత్‌లో పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఫస్ట్ అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్... - [హిందూ ఏక్తా యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు - సీపీ గౌస్ ఆలం](https://prajatelangana.com/hindu-ekta-yatra-cp-gouse-alam/): ప్రజాతెలంగాణ-కరీంనగర్ క్రైమ్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం  కరీంనగర్ పట్టణంలో నిర్వహించనున్న హిందూ ఏక్తా యాత్ర శోభా యాత్ర రూట్‌ను సీపీ గౌస్ ఆలం పరిశీలించారు . బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు .యాత్ర సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకట్ స్వామి , ఇన్‌స్పెక్టర్లు బిల్లా కోటేశ్వర్ , సృజన్ రెడ్డి , ఖరీముల్లా ఖాన్ , పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం : భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం - [భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం](https://prajatelangana.com/bharosa-kothapally-commissioner-ghouse-alam/): – బాధితులకు అందిస్తున్న సేవలు, కేసుల పురోగతిపై సమీక్ష ప్రజా తెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ పోలీస్ శాఖలోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో గత డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ కేంద్రం పనితీరును, బాధితులకు అందిస్తున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కేంద్రంలోని సిబ్బందితో మాట్లాడి, రికార్డులను పరిశీలించి, వాటిని సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కేసుల వివరాలను పరిశీలించిన ఆయన, నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని, బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భరోసా కేంద్రాలు మంచి సత్ఫలితాలనిస్తున్నాయి కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, లైంగిక వేధింపులకు గురైన మహిళలు, అసభ్యకరమైన లైంగిక ప్రవర్తనకు లోనైన పిల్లలకు పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులకు దూరంగా సురక్షితమైన వాతావరణంలో చేయూత అందించేందుకే తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖ, ఉమెన్... - [ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి - కలెక్టర్ పమేలా సత్పతి](https://prajatelangana.com/govt-schools-strenthening-district-collector-pamela-sathpathi/): ప్రజా తెలంగాణ – కరీంనగర్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతాన్ని పెంచి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు .విద్యాశాఖ ఆధ్వర్యంలో కొత్తపెల్లిలోని సెయింట్ జార్జ్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఐదు రోజుల ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధనతో పాటు తాము కూడా కొత్త అంశాలను నేర్చుకోవడం అవసరం. ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి అనేక సదుపాయాలు కల్పిస్తోంది. తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేలా చర్యలు తీసుకోవాలి” అని పేర్కొన్నారు.ప్రాథమిక పాఠశాల దశ విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని, విభిన్న నైపుణ్యాలతో ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. “పాఠశాలలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న శిక్షణా సామగ్రిని సద్వినియోగం చేసుకోవాలి. గురువులు విద్యార్థులకు సంరక్షకులుగా వారిని సన్మార్గంలో నడిపించాలి. సేవా దృక్పథంతో కూడిన... - [మాతృ మరణాలను అరికట్టేందుకు జిల్లా స్థాయి సమీక్ష సమావేశం](https://prajatelangana.com/district-level-maternal-death-dmho-karimnagarths/): ప్రజాతెలంగాణ- కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం ఆయన కార్యాలయంలో జిల్లా స్థాయి మాతృ మరణ కమిటీ (MDR) సమీక్షా సమావేశం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సమావేశం లో కమిటీ సభ్యులతో ఇటీవలి ప్రసూతి మరణాలపై  సమగ్రంగా చర్చించామన్నారు. వైద్య సంరక్షణలో జాప్యాలు, అత్యవసర సేవల అందుబాటు, రిఫెరల్ వ్యవస్థ, ప్రసవానంతర సంరక్షణ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. ప్రసూతి ఆరోగ్య సేవల మెరుగుదలకు, నివారించదగిన మాతృ మరణాలను తగ్గించేందుకు నిర్దిష్ట చర్యలను కమిటీ సభ్యులకు  సూచించడం జరిగిందన్నారు .ఈ సమావేశంలో పిఓఎంసి హెచ్ డాక్టర్ సనజవేరియా, పిఓడిటి డాక్టర్ ఉమాశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు, గైనకాలజిస్ట్ డాక్టర్ సుహాసిని, అనస్థటిస్ట్ డాక్టర్ సంగీత, బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి, డెమో రాజగోపాల్ సహా ఇతర వైద్య అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం :... - [దత్తత తల్లిదండ్రులకు ఉత్తర్వులు అందజేసిన కలెక్టర్ పమేలా సత్పతి](https://prajatelangana.com/adoption-orders-collector-pamela-sathpathi/): ప్రజా తెలంగాణ – కరీంనగర్ :  రక్తసంబంధికుల నుండి దత్తత తీసుకున్న దంపతులకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా మంగళవారం దత్తత ఉత్తర్వులు అందజేశారు. కరీంనగర్ కు చెందిన దంపతులు వారి కుటుంబ సభ్యుల నుండి 11 సంవత్సరాల బాలికను దత్తత తీసుకున్నారు. మహిళ, శిశు సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకోగా వారికి కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్లో ఉత్తర్వులు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు, రక్తసంబంధ దత్తత తీసుకోవాల్సిన వారు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని అన్నారు. ఇందుకు జిల్లా పరిషత్ కార్యాలయంలో గల జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, కరీంనగర్ లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ ధనలక్ష్మి, ,డిసిపిఓ పర్వీన్, ఎల్ సి పి ఓ రాజు పాల్గొన్నారు. మరిన్ని వార్తల... - [నిరుద్యోగులకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు - మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్](https://prajatelangana.com/unemployed-youth-brs-party-geekuru-ravinder/): ప్రజాతెలంగాణ – చిగురుమామిడి: గత పదేళ్లు అధికారంలో ఉండి బిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను నిర్వీర్యం చేసిందని, అధికారం కోల్పోయాక బిఆర్ఎస్ నాయకులు నిరుద్యోగుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ విమర్శించారు.ఆదివారం చిగురుమామిడి మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిటుమల్ల రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పదవిలో ఉన్నన్నాళ్లు ఎప్పుడూ వారు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం తో నిరుద్యోగులందరు  ఏకమై కేసీఆర్ కుటుంబానికి గుణపాఠం చెప్పారన్నారు.తెలంగాణ ఏర్పడితే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానాలు రద్దు చేస్తామన్న హామీని తుంగలో తొక్కడమే కాకుండా , 317 జీవో తీసుకొచ్చి స్పవుస్ నియమకాలు కూడా చేపట్టలేదన్నారు . ఉద్యోగులకు పిఆర్సి ఇవ్వకుండా 5% ఐఆర్ ప్రకటించి, 2.5% డిఏ పెండింగ్లో ఉంచారని , రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని వయోపరిమితిని 55... - [అవగాహన లేకే హక్కులు కోల్పోతున్నాం - సంచార ముస్లిం జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు షేర్ ఆలీ](https://prajatelangana.com/sanchar-muslim-state-president-shairali/): ప్రజా తెలంగాణ -కరీంనగర్ : రిజర్వేషన్లపై అవగాహన లేకే హక్కులు కోల్పోతున్నామని సంచార ముస్లిం జాగృతి సంఘ స్థాపకులు ఎం.డి. షబ్బీర్ అన్నారు.బీసీ-ఈ ధ్రువీకరణ పత్రాలు అర్హులైన వారికంటే ఆర్థికంగా, రాజకీయంగా బలమైన వారే పొందుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం కరీంనగర్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం చర్చా కార్యక్రమంలో నేతృత్వంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, బీసీ-ఈ రిజర్వేషన్ల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అబ్దుర్రహమాన్ మాట్లాడుతూ , “ఖాన్‌లు, పఠాన్‌లు, మొఘల్‌లు మా రిజర్వేషన్లు అక్రమంగా లబ్ధి పొందడం వల్ల సంచార ముస్లింలు తీవ్రంగా నష్టపోతున్నారు” అని తెలిపారు.కోశాధికారి ఎం.డి. షాదుల్లా మాట్లాడుతూ “సంచార ముస్లింలు ఐక్యంగా ఉండి పోరాటాలు చేసినప్పుడే మన హక్కులు, రిజర్వేషన్లు పొందగలుగుతాం,” అని ఉద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు షేర్ ఆలీ ,సంఘ స్థాపకులు ఎండి షబ్బీర్ యాకూబ్ , ఉపాధ్యక్షుడు చాంద్ పాషా, పాషా... - [లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత](https://prajatelangana.com/%e0%b0%b2%e0%b0%ac%e0%b1%8d%e0%b0%a7%e0%b0%bf%e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%8e%e0%b0%ab%e0%b1%8d/): ప్రజా తెలంగాణ – కరీంనగర్ రూరల్  : దుర్శేడ్ గ్రామానికి చెందిన వేముల స్వప్న, వానరాసి స్వప్న లకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బుర్ర హరీష్ గౌడ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకోవడం జరిగిందని తెలిపారు .అనంతరం లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, మాజీ సర్పంచ్ గాజుల అంజయ్య, కాంగ్రెస్ పార్టీ రూరల్ ఉపాధ్యక్షులు పాలకుర్తి లక్ష్మణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మురళీ కృష్ణ పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం : ప్రపంచ  హైపర్ టెన్షన్ డే పై అవగాహన కార్యక్రమం - [లబ్దిదారులకు సి ఎం ఆర్ ఎఫ్ చెక్ అందజేత](https://prajatelangana.com/cmrf-karimagar-mla-48-division-gudurimurali/): ప్రజా తెలంగాణ – కరీంనగర్ : అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య చికిత్సల నిమిత్తం సీఎంఆర్​ఎఫ్​  కింద నిధులు మంజూరు చేస్తున్నారని,48వ డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ కార్పొరేటర్ గూడూరి మురళి కోరారు .శనివారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా డివిజన్ చెందిన గున్నాల ప్రవీణ్ , పోరంల నారాయణ, నేదునూరి స్రవంతి , బచ్చు స్వరూప రాణి కుటుంబాలకు మంజూరు అయిన సి ఎం ఆర్ ఎఫ్ చెక్ లు అందజేశారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు ,కార్పొరేటర్లు ,డివిజన్ నాయకులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం : ప్రపంచ  హైపర్ టెన్షన్ డే పై అవగాహన కార్యక్రమం - [పార్కులను పరిరక్షించండి -మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్](https://prajatelangana.com/parks-protection-ex-mayor-sardar-ravinder-singh/): ప్రజా తెలంగాణ-కరీంనగర్ : కరీంనగర్ నగరం లోని పార్కుల స్థలాలను క్లబ్ స్థలాలుగా మార్చకుండా జిల్లా యంత్రాంగం పరిరక్షించాలని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు .శనివారం కరీంనగర్‌లోని హొటల్ తారక లో  నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ నగరంలోని పార్కుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో గతంలో 42 పార్కులు ఉండగా ప్రస్తుతం 35కి తగ్గినట్లు తెలిపారు. పార్కుల స్థలాలు కొన్ని క్లబ్‌లుగా మారుతున్నాయని పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించే పేరుతో రిజిస్టర్ అయిన పార్కులకు తాళాలు వేయడం ఏంటని ప్రశ్నించారు .గ్రామ పంచాయతీల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) జాబితా అధికారులు సరిగా నిర్వహించడం లేదన్నారు . దీనివల్ల పంచాయతీ భూముల రక్షణ సవాలుగా మారిందని తెలిపారు. LRS (లే-అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) విషయంలో ప్రజలపై అధిక భారం పడుతున్నట్లు సర్దార్ రవీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా,... - [పిల్లల రక్షణ అందరి బాధ్యత](https://prajatelangana.com/%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b2-%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3-%e0%b0%85%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%ac%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af/): ప్రజా తెలంగాణ -కరీంనగర్ రూరల్ : పిల్లల రక్షణ అందరి బాధ్యత అని వారి హక్కులు, చట్టాలపై అందరికి అవగాహన ఉండాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ ఆవుల సంపత్ అన్నారు.శనివారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల కేంద్రంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రం లో ఆయన తో పాటు , సఖీ సెంటర్ అడ్మిన్ లక్ష్మి పాల్గొని బాలికల భద్రత, లింగ సమానత్వం , పిల్లల అక్రమ రవాణా గురించి అవగాహనా కల్పించి ఉపాధ్యాయుల పాత్ర, పిల్లల లో తీసుకురావాల్సిన మార్పు గురించి చర్చించారు, పోక్సో చట్టం 2012, బాల్య వివాహ నిరోధక చట్టం 2006 , జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015 పై శిక్షణ కల్పించారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098, మహిళా హెల్ప్ లైన్... - [వరల్డ్ హైపర్ టెన్షన్ డే పై అవగాహన కార్యక్రమం](https://prajatelangana.com/world-hyper-tension-day-dmho-karimnagar/): కరీంనగర్-ప్రజా తెలంగాణ : మే 17 , ప్రపంచ హైపర్‌టెన్షన్ దినోత్సవం సందర్భంగా శనివారం కరీంనగర్ లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా కార్యాలయ సిబ్బందికి రక్తపోటు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స అందించారు అనంతరం ప్రోగ్రాం అధికారులతో కలిసి జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ “ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్నిజరుపుకుంటారని, ప్రజలందరూ ‘ఒత్తిడిని సమతుల్యం చేసుకొని , ఆరోగ్యకరమైన జీవితాన్నిఆస్వాదించాలని కోరారు . ఆయన మాట్లాడుతూ, “అధిక రక్తపోటు వల్ల కలిగే సమస్యలను ఎదుర్కోవడం కంటే దానిని నివారించడం మంచిది. వయోజన జనాభాలో 45% మందికి పైగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇది అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలలో కనిపిస్తుంది మరియు వయసుతో పాటు పెరుగుతుంది,” అని వివరించారు.రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి మందులతో పాటు... - [శాతవాహనలో ప్రశాంతంగా సాగుతున్న డిగ్రీ పరీక్షలు](https://prajatelangana.com/su-degree-sem-exams-vc-umesh-kumar/): ప్రజా తెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలో మే 14 నుండి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ తెలిపారు . ఆకస్మిక తనిఖీలో భాగంగా ఆయన శనివారం కరీంనగర్ పట్టణంలోని వాణినికేతన్ డిగ్రీ కళాశాలను సందర్శించి, పరీక్షల నిర్వహణను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, “విద్యా సంవత్సరంలో ఎటువంటి అంతరాయం లేకుండా తృతీయ సంవత్సర విద్యార్థులకు న్యాయం జరిగేందుకు పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నాము” అని తెలిపారు.పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేసి, ఫలితాలను సకాలంలో విడుదల చేయాలని పరీక్షల నియంత్రణ అధికారి డా. సురేష్ కుమార్‌ను ఆదేశించారు. మరిన్ని వార్తల కోసం : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో మే 14 నుండి డిగ్రీ పరీక్షలు - [సత్ప్రవర్తన చెందని రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ - కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి](https://prajatelangana.com/transformation-history-sheeters-karimnagar-police/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్: పోలీసు రికార్డుల్లో హిస్టరీ షీటర్లుగా కొనసాగుతున్న నేరచరితులు సత్ప్రవర్తనతో మెలగాలని కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి అన్నారు . పరివర్తన చెందకుండా పాత పద్ధతులను అనుసరిస్తూ నేరాల్లో భాగస్వాములైతే పీడీ యాక్ట్‌ను అమలు చేసి సంవత్సరాల తరబడి జైల్లోనే ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.శుక్రవారం కరీంనగర్ రూరల్ సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లకు సీఐ కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, క్షణికావేశాలతో అనాలోచిత విధానంలో గతంలో నేరాలకు పాల్పడిన వారు సత్ప్రవర్తనతో మెలిగితే వారి పేర్లను పోలీసు రికార్డుల నుండి తొలగిస్తామన్నారు . గత ఐదు సంవత్సరాలుగా ఏ నేరాల్లో భాగస్వాములు కాకుండా, అనారోగ్యంతో, సత్ప్రవర్తనతో ఉన్న వారి పేర్లను పోలీసు రికార్డుల నుండి తొలగించేందుకు పరిశీలిస్తున్నామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరచరితులు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకుని తమపై ఆధారపడిన కుటుంబాలను పోషించేందుకు జీవనోపాధి కోసం... - [కలెక్టర్లు మానవీయకోణంలో భూసమస్యలు పరిష్కరించాలి - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి](https://prajatelangana.com/%e0%b0%95%e0%b0%b2%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%b5%e0%b1%80%e0%b0%af%e0%b0%95%e0%b1%8b%e0%b0%a3%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b/): ప్రజా తెలంగాణ – జగిత్యాల:  కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భూసమస్యలు పరిష్కరించాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు .శుక్రవారం రాత్రి జగిత్యాల కలెక్టరేట్‌లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణకుమార్, ఆది శ్రీనివాస్‌తో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, “జిల్లా కలెక్టర్లు మానవీయ కోణంలో భూసమస్యలు పరిష్కరించాలి. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో భూసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి” అని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమన్వయంతో కలిసి పనిచేస్తూ భూసమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.పైలెట్ మండలాల్లో భూభారతి చట్టం, రెవెన్యూ సదస్సుల నిర్వహణ తీరును మంత్రి సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న భూసమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు సూచనలు, సలహాలు... - [న్యాయ కళాశాల మంజూరులో మంత్రి పొన్నం కృషి ఎన లేనిది- లీగల్ సెల్ స్టేట్ జాయింట్ కన్వీనర్ భూక్య రజనీష్](https://prajatelangana.com/congress-legalcell-rajanish-bhukya-lawcollege/): ప్రజా తెలంగాణ-కరీంనగర్ : కరీంనగర్ కు న్యాయ కళాశాలను మంజూరు చేయడంలో మంత్రి పొన్నం ప్రభాకర్  కృషి ఎనలేనిదని స్టేట్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ భూక్య రజనీష్ అన్నారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి పొన్నం ప్రభాకర్ న్యాయ కళాశాలను మంజూరు చేయిస్తే బిజెపి నాయకులు తమ ఖాతాలో వేసుకోవడం విడ్డూరమన్నారు. న్యాయ కళాశాల మంజూరు విషయంలో కృషిచేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు మరోసారి కాంగ్రెస్ లీగల్ సెల్ తరపున ధన్యవాదాలు తెలిపారు . ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ జిల్లా చైర్మన్ కల్లేపల్లి లక్ష్మయ్య, వైస్ చైర్మన్ వడ్లూరి కృష్ణ, జిల్లా కన్వీనర్ కొత్తకొండ శంకర్, లింగంపల్లి శ్రీకాంత్ , కో కన్వీనర్ ఐతు సృజన్, న్యాయవాదులు తునికి పవన్ కుమార్, గౌతమ్, జేరిపోతుల... - [వలస కార్మికుల పిల్లలకు విజయవంతంగా విద్యా బోధన](https://prajatelangana.com/education-migrant-worker-children/): –   విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజాతెలంగాణ -కరీంనగర్ : జిల్లాలోని సుమారు 500 మంది వలస కార్మికుల పిల్లలకు ప్రత్యేక పాఠశాలల్లో విజయవంతంగా విద్యాబోధన పూర్తి చేయనున్నామని, కార్మికుల పిల్లలందరినీ చదువు వైపు ఆకర్షించామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.కలెక్టరేట్ ఆడిటోరియంలో వలస కార్మికుల పిల్లలు, ఉపాధ్యాయులు, యజమానులతో గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వలస కార్మికుల పిల్లలు చదువుకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యేక తరగతుల ద్వారా విద్యా బోధన చేయాలని నిర్ణయించామని అన్నారు. ఎంపిక చేసిన 16 పాఠశాలల్లో సుమారు 500 మంది విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా గత ఫిబ్రవరి మొదటి వారం నుండి బోధిస్తున్నామని అన్నారు. ఇటుక బట్టి యజమానుల సహకారంతో వీరికి కావలసిన రవాణా సదుపాయం ఏర్పాటు చేశామని, యూనిఫామ్ అందించామని తెలిపారు. జిల్లా యంత్రాంగం తరఫున పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు... - [స్టేట్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కు సన్మానం](https://prajatelangana.com/tpcc-legalcell-chairman-karimnagarbar-felicitation/): ప్రజా తెలంగాణ – న్యాయ వార్తలు : టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ బుధవారం కరీంనగర్ జిల్లా కోర్ట్ కు విచ్చేసిన సందర్భంగా కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగంపల్లి నాగరాజు శాలువా కప్పి సన్మానించారు.అనంతరం నూతనంగా ఎన్నికైన కరీంనగర్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజుకు పొన్నం అశోక్ గౌడ్ శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ తను మొదట న్యాయవాది గా ప్రాక్టీస్ చేసిన బార్ కు చాల రోజుల తర్వాత రావడం, తన పాత మిత్రులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ బాధ్యులు భూక్యా రజనీష్, ఆర్ దేవేందర్ రెడ్డి, రాచకొండ ప్రభాకర్, పంజాల కుమార స్వామి,శంకర్ తదితరులు పాల్గొన్నారు. - [ఎస్ యూ లో లా డిగ్రీ కోర్స్ కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం](https://prajatelangana.com/sathavahana-university-lawcollege-bci/): ప్రజాతెలంగాణ -కరీంనగర్ : కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి యు ఉమేష్ కుమార్ తెలిపారు. 2025-26 అకాడమిక్ ఇయర్ నుండి తరగతులు ప్రారంభం అవుతాయని, కొత్త కోర్సుల మౌలిక ఏర్పాటు లో విశ్వవిద్యాలయం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దీనికి తోడ్పాటు అందించిన రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ , కేంద్ర మంత్రివర్యులు బండి సంజయకుమార్ ,కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లకు  ఉపకులపతి యు ఉమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.   మరిన్ని వార్తల కోసం : సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి - [సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి](https://prajatelangana.com/awareness-program-cybercrime-drugfreesociety-karimnagar-rural/): – కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి ప్రజా తెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : ఈమధ్య కాలంలో జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి అన్నారు. సెల్ ఫోన్లో వస్తున్న వివిధ రకాల మెసేజ్ లను గుడ్డిగా నమ్మి తెరవకూడదని సూచించారు. బుధవారం నాడు కొత్తపల్లి మండలం రేకుర్తి లోని లయోలా కాలేజీ ఆవరణలో దేశ సైన్యం,  రక్షణ విభాగాల్లో ఉద్యోగాల ఎంపిక కోసం శిక్షణ పొందుతున్న యువకులకు సైబర్ మోసాలు , మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం – దుష్పరిణామాలు అంశం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమ కష్టార్జితంతో సంపాదించి బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను తస్కరించేందుకు సైబర్ నేరగాళ్లు పలు రకాల ఎత్తుగడలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.... - [ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి- కలెక్టర్ పమేలా సత్పతి](https://prajatelangana.com/indirammaillu-collector-pamelasathpathi-karimnagar-completion/): ప్రజా తెలంగాణ – కరీంనగర్ :  జిల్లాలో ఇదివరకే మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం గృహ నిర్మాణ సంస్థ అధికారులతో, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొదటి దఫా మంజూరైన 2027 ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అన్నారు. ఈ వారాంతంలోగా అన్ని ఇండ్లకు మార్కింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. 15 రోజుల్లోగా మంజూరైన అన్ని ఇండ్లు బేస్మెంట్ లెవెల్ కు చేరాలని అన్నారు. హౌసింగ్, రెవెన్యూ, పంచాయతీ, మునిసిపల్ అధికారులు సమన్వయంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. లబ్ధిదారులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని మండల కేంద్రాల్లో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల పనులను ఈనెల 25 లోగా పూర్తి చేయాలన్నారు. మొదటి విడత చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.... - [భూ భారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి](https://prajatelangana.com/bhu-bharati-revenuecamps-collector-pamela-sathpathi/): –   కలెక్టర్ పమేలా సత్పతి ప్రజాతెలంగాణ- కరీంనగర్ రూరల్ : భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా పైలట్ మండలం సైదాపూర్ లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామపంచాయతీ భవనంలో, బొమ్మకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు కలెక్టర్ హాజరయ్యారు.. రైతులు, ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంపై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే అన్ని మండలాల్లో నూతన చట్టం గురించి అవగాహన కల్పించామని గుర్తు చేశారు. ప్రభుత్వ... - [హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి కార్పస్ ఫండ్ అందజేత](https://prajatelangana.com/corpus-fund-policeconstable-commissioner/): ప్రజాతెలంగాణ- కరీంనగర్ : ఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ జి. రాజిరెడ్డి కుటుంబానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మంగళవారం కార్పస్ ఫండ్ చెక్కును అందజేశారు. రామడుగు మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన రాజిరెడ్డి కరీంనగర్ కమిషనరేట్‌లోని ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తూ గత డిసెంబర్ నెలలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, రాజిరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్పస్ ఫండ్ ద్వారా మంజూరైన ఈ ఆర్థిక సహాయం వారి కుటుంబానికి కొంతైనా ఊరట కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మృతి చెందిన రాజిరెడ్డి భార్య వజ్రమ్మకు కమిషనర్ స్వయంగా చెక్కును అందజేశారు. ఈ విషాద సమయంలో పోలీస్ శాఖ తమకు అండగా నిలవడం పట్ల వజ్రమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి సెక్షన్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్,... - [ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు](https://prajatelangana.com/awareness-program-illegal-sand-transportation/): –  కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి ప్రజాతెలంగాణ- కరీంనగర్ రూరల్ : ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి అన్నారు .మంగళవారం నాడు కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి, కొత్తపల్లి ఎస్ఐ సాంబ మూర్తి లు ఇసుక అక్రమ రవాణా- చట్టపరమైన చర్యలు అంశంపై ఎలగందల్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి ఉన్న రీచ్, క్వారీల నుండి ఇళ్ళు,ఇతరత్రా నిర్మాణాలకు ఇసుక ను కొనుగోలు చేయాలని సూచించారు. మానేరు పరివాహక ప్రాంతాల నుండి అక్రమంగా తరలించ బడుతున్న ఇసుకను కొనుగోలు చేయవద్దని చెప్పారు. అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేసే వారికి సంబంధించిన వివరాలను గత 10 సంవత్సరాల క్రితం నుండి పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. అనుమతి లేని ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుకను... - [ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ](https://prajatelangana.com/indian-army-solidarity-rally-tngo-tgo/): ప్రజాతెలంగాణ – కరీంనగర్  :  దేశ ప్రజల రక్షణకు పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్న భారత సైన్యానికి (సాయుధ దళాలు) మద్దతుగా  టీఎన్జీవో, టీజీవో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో   సోమవారం జిల్లా కేంద్రంలో  నిర్వహించిన   సంఘీభావ ర్యాలీని కలెక్టరేట్ వద్ద కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుంచి ప్రతిమ మల్టీప్లెక్స్ మీదుగా అమరవీరుల స్తూపం వరకు కొనసాగింది . ర్యాలీలో వివిధ శాఖల అధికారులు, ఎన్ సీ సీ కేడేట్లు, నగరపాలిక కార్మికులు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాలను పట్టుకొని ర్యాలీ కొనసాగిస్తూ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. యుద్ధంలో వీరమరణం పొందిన జవాను మురళి నాయక్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, టీజీవో జిల్లా... - [శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో మే 14 నుండి డిగ్రీ పరీక్షలు](https://prajatelangana.com/sathavahana-univesity-degreeexams/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు టైం టేబుల్ ప్రకారం మే 14 నుండి యథావిధిగా ప్రారంభం అవుతాయని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డా. డి సురేష్ కుమార్ తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు.పరీక్ష ఫీజులు చెల్లించిన కాలేజి విద్యార్థులకే పరీక్షలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఇంకా పరీక్ష ఫీజ్ చెల్లించని అనేక ప్రైవేట్ కళాశాలలు 12వ తేదీ లోగా ఫీజులు చెల్లిస్తాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహిస్తున్నామని, త్వరలోనే విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వార్తల కోసం : జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - [జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి](https://prajatelangana.com/journalist-welafare-minister/): ప్రజాతెలంగాణ – వెబ్ డెస్క్  :  జర్నలిస్టుల   సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఒక్కొక్కటిగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే. విరాహత్ అలీ, కే. రాంనారాయణల నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం మంత్రి శ్రీనివాస్ రెడ్డితో సచివాలయంలోని ఆయన ఛాంబర్ లో సమావేశమై జర్నలిస్టుల వివిధ సమస్యలపై చర్చించింది.ఎన్నికల సమయంలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమాన్ని పొందుపర్చడంతో జర్నలిస్టులు ఎంతో హర్షించారని, అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ఇంకా ఏ ఒక్క సమస్యకు పరిష్కారం దక్కకపోవడంతో జర్నలిస్టుల్లో నిరాశ చోటుచేసుకుందని విరాహత్, రాంనారాయణలు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రెడిటేషన్ల నియమావళి రూపకల్పనా కోసం ప్రభుత్వం కమిటీ వేసిందని, ఆ కమిటీ... - [మే 4 న భీమ్ ఆర్మీ జిల్లా కమిటీ ఏర్పాటు - భీమ్ ఆర్మీ వైస్ ప్రెసిడెంట్ చంద్రయ్య](https://prajatelangana.com/may4-bheemarmy-chandranna-friday/): ప్రజాతెలంగాణ – భీమ్ ఆర్మీ  :  భీమ్ ఆర్మీ కరీంనగర్ జిల్లా పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటు మే 4 ఆదివారం నిర్వహించనున్నట్లు భీమ్ ఆర్మీ స్టేట్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రయ్య తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ  ఉదయం 10 గంటల నుండి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కమిటీ వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వర్కింగ్ ప్రెసిడెంట్ డాన్ శ్రీను, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు చేపూరి విజయ్ కుమార్ ముఖ్య అతిథి గా హాజరు అవుతారన్నారు.ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బిసి , మైనార్టీల సభ్యులు కుల మతాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని  కోరారు. - [కరీంనగర్:  ఫోటో  స్టూడియోల బంద్ విజయవంతం](https://prajatelangana.com/photo-studio-bandh-karimnagar/): ప్రజా తెలంగాణ- కరీంనగర్:   ఫోటో స్టూడియోల నిర్వహణకు అవసరమయ్యే ముడిసరుకుల ధరలు  పెరగడం తో నగరంలో ని ఫోటో గ్రాఫర్ లు , అనుబంధ కార్మికులు గురువారం ఒకరోజు బందు పాటించారు. నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.ఈ కార్య క్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాడే రవి, సలహాదారుడు కేదార్ రెడ్డి, కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ కొప్పుల కనకారావు, నాగిశెట్టి రమేష్,మాటూరి రంజిత్ తదితరులు పాల్గొన్నారు. - [కరీంనగర్ లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలు](https://prajatelangana.com/babujagjivanram-jayanthicelebrations-karimnagar/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ : కరీంనగర్ లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలు, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న వయసులో కేంద్ర మంత్రివర్గంలో అనేక పదవులు చేపట్టిన బాబు జగ్జీవన్ రామ్ భారత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. చదువు ద్వారానే... - [కరీంనగర్ : డ్రోన్ల వినియోగంపై నిషేధాజ్ఞలు](https://prajatelangana.com/cp-droneusage-prohibhtion-karimnagar/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ : కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో భద్రత కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఏయిర్ క్రాఫ్ట్ ల వినియోగాన్ని నిషేదించడం జరిగిందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిషేదాజ్ఞలు ఈనెల 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఏయిర్ క్రాఫ్ట్ లను ఈ మధ్యకాలంలో వివాహాది శుభకార్యాలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా వినియోగించబడుతున్నాయని తెలిపారు. ఉగ్రవాదులు, అసాంఘికశక్తులు వీటిని వినియోగించే అవకాశాలుండటంతో సదరు సాంకేతిక పరికరాల వినియోగాన్ని నిషేదించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా వినియోగించదలచినట్లయితే సంబంధిత పోలీసుల అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపిసి సెక్షన్ 188 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరిన్ని వార్తల కోసం : ... - [దేవక్కపల్లిలో క్రికెట్ పోటీలు ప్రారంభం](https://prajatelangana.com/padaalakanakavva-devakkapally-cricketmatch/): ప్రజాతెలంగాణ – కరీంనగర్ : పడాల కనకవ్వ గౌడ్ జ్ఞాపకార్థం ఆమె మనుమడు బుర్ర విజయ్ గౌడ్ నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు శనివారం దేవక్కపల్లిలో ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి కరివేద మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కాసింపేట, చిన్న ములకనూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ ను  ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని కోరారు .కాంగ్రెస్ నాయకుడు కంది వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. అమ్మమ్మను గుర్తు చేసుకుంటూ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు.స్పాన్సర్ బుర్ర విజయ్ గౌడ్ మాట్లాడుతూ.. అమ్మమ్మ అంటే చాలా ఇష్టమని, ఆమెపై అభిమానానికి నిదర్శనమే ఈ టోర్నమెంట్ అని అన్నారు.ఈ పోటీల్లో విజేతకు 20,000, రన్నర్ కు 10,000, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 5,000 ప్రైజ్ మనీ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రావుల రామకృష్ణారెడ్డి, ఒంటెల సంపత్ రెడ్డి, రావుల గోవర్ధన్ రెడ్డి, సొల్లు అజయ్ వర్మ, పడాల అశోక్ గౌడ్, వరుణ్,... ## Pages - [Subscribe Us](https://prajatelangana.com/subscribe-us/) - [Sample Page](https://prajatelangana.com/sample-page/): This is an example page. It’s different from a blog post because it will stay in one place and will show up in your site navigation (in most themes). Most people start with an About page that introduces them to potential site visitors. It might say something like this: Hi there! I’m a bike messenger by day, aspiring actor by night, and this is my website. I live in Los Angeles, have a great dog named Jack, and I like piña coladas. (And gettin’ caught in the rain.) …or something like this: The XYZ Doohickey Company was founded in 1971,... - [Contact Us](https://prajatelangana.com/contact-us/) [comment]: # (Generated by Hostinger Tools Plugin)