
ఆదిపురుష్ టీం అపురూప నిర్ణయం.. శ్రీరామబంటుకు ప్రత్యేకం.. సినిమా చరిత్రలో సంచలనం
రామాయణ పారాయణం ఎక్కడ జరిగినా దానికి ఒక విశిష్టత ఉంటుంది. శ్రీరామ కథను ఎక్కడ ప్రదర్శించినా ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక కోలాహలంతో నిండిపోతుంది. అనిర్వచనీయమైన అనుభూతికి ప్రతి ఒక్కరూ లోనవడం అత్యంత సహజంగా జరిగిపోతుంది. భారతీయులకు శ్రీరామునితో ఉండే అనుబంధం అటువంటిది. రామయనంతో ఉండే బంధం అలాంటిది. రామాయణం ఎన్ని సార్లు సినిమాగా వచ్చినా అన్నీ సార్లూ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ శ్రీరాముని కథామృతం అంతర్జాతీయ స్థాయిలో ఆదిపురుష్ గా వెండితెర మీద సందడి…