
Hathras Tragedy: హత్రాస్‌లో 121 మంది ఎందుకు, ఎలా చనిపోయారు? సిట్ నివేదిక ఏం చెబుతోంది?
హత్రాస్ ప్రమాదంపై సిట్ తన నివేదికను దాఖలు చేసింది. ఇందులో తొక్కిసలాట నిర్లక్ష్యం, నిర్వహణ లోపం వల్లే జరిగిందని వివరించారు. స్థానిక అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించకపోవడం కూడా వెలుగులోకి వచ్చింది. అనుమతించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని అప్పటికే స్థానిక అధికారులకు సమాచారం ఉందని సిట్ నివేదిక చెబుతోంది.