Summer Effect: ఏప్రిల్ లో వేడి సెగలకు కారణం ఏమిటో తెలుసా?
ఏప్రిల్, మే ప్రధాన వేసవి నెలలు. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు చేరుకుంది. హైదరాబాద్ లో 35-36 డిగ్రీలు ఉండాల్సిన ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటాయి.
ఏప్రిల్, మే ప్రధాన వేసవి నెలలు. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు చేరుకుంది. హైదరాబాద్ లో 35-36 డిగ్రీలు ఉండాల్సిన ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటాయి.
T20 ప్రపంచ కప్ కోసం భారత T20 జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు . హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తొలి విజయం సాధించింది. ప్రస్తుత సీజన్‌లో బుధవారం జరిగిన 8వ మ్యాచ్‌లో ఆ జట్టు 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ (ఎంఐ)ని ఓడించింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్…
AP Elections: రాజకీయాల్లో కొత్తపోకడలు వచ్చాయి. రాజకీయాల్లో వ్యాపారం పోయింది. రాజకీయమే వ్యాపారం అయింది. ఏపీ ఎన్నికల వేళ సరికొత్త విన్యాసాలు మొదలయ్యాయి. నిజానికి ఇవి ఇప్పుడు మొదలు కాలేదు. వీటికి బీజం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పడింది. ఏ లక్ష్యాన్ని ఆశించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకు వచ్చారో అది పూర్తీ స్థాయిలో విజయవంతం అయింది. ఒక గొలుసుకట్టు వ్యాపారంలా.. ఇదొక గొలుసుకట్టు రాజకీయం(AP Elections). ఏభై కుటుంబాలకో వాలంటీర్….
IPL 2024: ఈరోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 8వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI)తో తలపడనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:00 గంటలకు టాస్ జరుగుతుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. ఈ రెండు టీములు తామాడిన మొదటి మ్యాచ్ లలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. SRH కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో…
IPL 2024: ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈసారి ఆ జట్టు 2022 చాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2012 తర్వాత నుంచి టోర్నీలో తొలి మ్యాచ్‌లో విజయం కోసం ముంబై ఎదురుచూస్తోంది. చివరిసారిగా టోర్నీలో తన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది ముంబై. PL 2024: ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై టాస్ గెలిచి…
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024కి ముందు, రాజస్థాన్ రాయల్స్‌కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా ప్రస్తుత సీజన్ నుండి తప్పుకున్నాడు. ఇతన్ని 1.5 కోట్లకు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. క్రిక్‌ఇన్‌ఫో తన నివేదికలో 31 ఏళ్ల జంపా వ్యక్తిగత కారణాల వల్ల లీగ్ ప్రస్తుత సీజన్(IPL 2024)కు దూరంగా ఉన్నట్లు పేర్కొంది. ఆడమ్ జంపా స్థానాన్ని రాజస్థాన్ జట్టు ఇంకా ప్రకటించలేదు. ఇండియన్ లీగ్ నుండి అతను…
IPL 2024 సీజన్ 17 సమీపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ముందుగా అద్భుతంగ ప్రారంభోత్సవ వేడుక ఉండబోతోంది. IPL 2024 ప్రారంభ వేడుక IPL 2024 ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈ వేడుకను చెన్నైలోని చిదంబరం స్టేడియంలో నిర్వహించనున్నారు. సీఎస్‌కే, ఆర్‌సీబీ…
AP Elections: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ ప్రచారాలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. సువిధ యాప్ ద్వారా సమావేశాలు, ప్రచారాలకు అనుమతులు ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనవద్దని సూచించారు. చట్ట ప్రకారం అది నేరం. వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. నిన్నటి వరకు 46 మందిపై…
డిసెంబర్-2023లో ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అంటే GST నుండి దాదాపు రూ.1.65 లక్షల కోట్లు వసూలు చేసింది. ఇది ఏడాది క్రితం అంటే డిసెంబర్ 2022 కంటే 10% ఎక్కువ. అప్పుడు జీఎస్టీ ద్వారా రూ.1.49 లక్షల కోట్లు వసూలయ్యాయి. నెల క్రితం నవంబర్‌లో జీఎస్టీ ద్వారా ప్రభుత్వం రూ.1.67 లక్షల కోట్లు వసూలు చేసింది. 1.5 లక్షల కోట్లకు పైగా వసూళ్లు రావడం ఇది వరుసగా 10వ సారి. అయితే, ఇప్పటి వరకు…