
Andhra Pradesh: బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు.. ఒకరి మృతి
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో సోమవారం బాణాసంచా తయారు చేసే ఇంట్లో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం(Rajamahendravaram)లో చోటుచేసుకుంది. దీపావళి రోజున జరిగిన ఈ ప్రమాదంలో జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉన్న ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఘటనా సమయంలో బాధితుడి భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లో లేరు. బాణాసంచా పేలుడు తో పాటు ఎల్‌పీజీ సిలిండర్ కూడా పేలి ఇల్లు మొత్తం ధ్వంసమైంది. పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి…