
Zimbabwe Vs India T20: ఒక్కరోజే.. టీమిండియా గేర్ మార్చింది.. జింబాబ్వే గిలగిల లాడింది! అదరగొట్టిన భారత్ కుర్రాళ్లు !
Zimbabwe Vs India T20: జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో యువ భారత జట్టు అద్భుతంగా పునరాగమనం చేసింది. సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కానీ హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆదివారం భారత జట్టు ఏకపక్షంగా విజయం సాధించింది.