
Solar Eclipse: ఆలయాల మూసివేత.. నిర్మానుష్యంగా మారిన తిరుమల
సూర్యగ్రహణం(Solar Eclipse) కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలు మంగళవారం మూతపడ్డాయి. శ్రీశైలంలోని మల్లికార్జున ఆలయం, విజయవాడలోని కనకదుర్గ ఆలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలంలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను మూసివేశారు. ఎప్పటిలాగే రాహు, కేతు సర్పదోష నివారణ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో వైలింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. దీంతో పాటు పిఠాపురంలోని పాదగయ ఆలయాలు, కర్నూలులోని సంగమేశ్వర ఆలయాలు కూడా తెరిచి ఉన్నాయి. తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని ఉదయం 8:11 గంటల నుంచి రాత్రి…