కూచిపూడి పోటీల్లో హుజురాబాద్ చిన్నారికి ప్రథమ స్థానం

ప్రజాతెలంగాణ-హుజురాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జరిగిన కళా సమ్మేళన్ 2025లో కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీల్లో హుజురాబాద్ పట్టణానికి చెందిన వై.వినోద్-మహేందర్‌రెడ్డి దంపతుల కుమార్తె నిర్వి రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా బుధవారం కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి , హుజురాబాద్ రూరల్ బిజెపి నాయకులు చిదిరాల శ్రీనివాస్‌రెడ్డి-రాణి దంపతులు వై.నిర్వి రెడ్డిని అభినందించారు.ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం :

మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు: సీపీ గౌస్ ఆలం

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!