
ఘనంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు
ప్రజాతెలంగాణ – కరీంనగర్: జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని అన్నారు. గతంలో వారు తెలంగాణ వ్యాప్తంగా చేసిన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని…