ప్రజా తెలంగాణ – చొప్పదండి : సీనియర్ జర్నలిస్టు సోంబోజి చంద్రశేఖర్ శుక్రవారం గుండెపోటు తో మృతి చెందారు.ప్రైవేట్ టీచర్ గా విద్యార్థులను తీర్చిదిద్దుతూనే ,జర్నలిజం పై మక్కువతో వివిధ పత్రికలలో రిపోర్టర్ గా సేవలందించిన ఆయన సమాజానికి ఉపయోగపడే పలు వార్త కథనాల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. కాగా ప్రజా ప్రతినిధులు ,పలు జర్నలిస్ట్ సంఘాల నేతలు స్పందిస్తూ ఆయన మృతి సమాజానికి,పాత్రికేయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.
మరింత :
చొప్పదండిలో పద్మశాలి సంఘాల నూతన కమిటీల ప్రమాణ స్వీకారం


