– అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్
ప్రజాతెలంగాణ- కరీంనగర్ : వర్షాకాలం నేపథ్యంలో వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తెలిపారు. ఈ కారణంగా జూన్ 30 వరకు రేషన్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటనలో వెల్లడించారు.ఆహార భద్రతా కార్డుదారులకు వ్యక్తికి ఆరు కిలోల చొప్పున, అంత్యోదయ కార్డుదారులకు నెలకు 35 కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డుదారులకు నెలకు 10 కిలోల చొప్పున మూడు నెలల బియ్యం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. అంత్యోదయ కార్డుదారులకు నెలకు ఒక కిలో చక్కెర చొప్పున మూడు నెలలకు పంపిణీ చేస్తామని, కిలోకు రూ.13.50 చెల్లించాలని అడిషనల్ కలెక్టర్ వెల్లడించారు.
మరిన్ని వార్తల కోసం :