
కరీంనగర్: ఫోటో స్టూడియోల బంద్ విజయవంతం
ప్రజా తెలంగాణ- కరీంనగర్: ఫోటో స్టూడియోల నిర్వహణకు అవసరమయ్యే ముడిసరుకుల ధరలు పెరగడం తో నగరంలో ని ఫోటో గ్రాఫర్ లు , అనుబంధ కార్మికులు గురువారం ఒకరోజు బందు పాటించారు. నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.ఈ కార్య క్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాడే రవి, సలహాదారుడు కేదార్ రెడ్డి, కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ కొప్పుల కనకారావు, నాగిశెట్టి రమేష్,మాటూరి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.