రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి – కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి కొత్త రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. భూ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడు ప్రాథమిక పాఠశాలలో, కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ అవగాహనా సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో…

మరింత

ఉప కార్మిక కమిషనర్ గా కోల ప్రసాద్

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : ఉప కార్మిక సహాయ శాఖ కార్యాలయంలో ఉప కార్మిక కమిషనర్ గా కోల ప్రసాద్ సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాదులో సహాయ కార్మిక కమిషనర్ గా విధులు నిర్వహించిన ప్రసాద్ పదోన్నతి పై కరీంనగర్ కార్మిక శాఖ కార్యాలయంలో విధులు చేరారు.ఈ సందర్భంగా ఉప కార్మిక కమిషనర్ ప్రసాద్ ను సహాయ కార్మిక కమిషనర్ ఎస్ వెంకటరమణ, సహాయ కార్మిక అధికారులు రఫీ మహమ్మద్, చక్రధర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్లు…

మరింత

తెలంగాణను ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతాం – మంత్రి శ్రీధర్ బాబు

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : తెలంగాణను ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్-2047 విజన్‌తో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్‌లో మాట్లాడిన మంత్రి, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తున్నట్టు…

మరింత

నవోదయ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

కరీంనగర్: దేశవ్యాప్తంగా ఉన్న 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు వివరాలు : ఐదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు లేదా ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుకుంటున్నారు. ప్రవేశ పరీక్ష తేదీలు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పర్వత ప్రాంత రాష్ట్రాల్లో వచ్చే…

మరింత

ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ

ప్రజాతెలంగాణ – కరీంనగర్: జూన్, జులై, ఆగష్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ముందస్తుగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ ప్రకటించింది.జూన్ 1 నుంచి 30 వరకు బియ్యం, చక్కెర పంపిణీ చేస్తామని తెలిపింది. ఇప్పుడు తీసుకోకపోతే తర్వాత సెప్టెంబర్‌లో మాత్రమే రేషన్ అందుతుందని వెల్లడించింది.ఒకేసారి మూడు నెలల రేషన్ లభించడం తో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే మూడు నెలల బియ్యం ఒకేసారి అందించడం తో పాటు ,సెప్టెంబర్ వరకు రేషన్ తీసుకునే…

మరింత

కౌన్సిలింగ్‌తో యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

ప్రజా తెలంగాణ – కరీంనగర్ రూరల్: కొత్తపల్లి మండలం బావుపేటకు చెందిన నేరెళ్ల సన్నీ అలియాస్ దయాసాగర్ కుటుంబ సభ్యులతో గొడవపడిన తర్వాత కోపంతో ఆదివారం గ్రామంలోని వాటర్ ట్యాంక్‌పై ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న కానిస్టేబుల్ విజయరావు ఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంక్‌పై ఉన్న సన్నీతో ఓపికగా మాట్లాడుతూ కౌన్సిలింగ్ చేశాడు. యువకుడి అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి పరిస్థితిని చక్కదిద్దాడు.సంయమనంతో కౌన్సిలింగ్ చేసి…

మరింత

కేంద్ర సహాయ మంత్రి చేతుల మీదుగా ఎలైట్ వరల్డ్ స్కూల్ ప్రారంభం

ప్రజాతెలంగాణ -కరీంనగర్ : కరీంనగర్ పట్టణం లోని కోతిరాంపూర్‌లో గల ఎలైట్ వరల్డ్ స్కూల్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం పాఠశాల నిర్వాహకుల సమక్షంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్య, శ్రేష్ఠత మరియు సాధికారతలో పరివర్తనాత్మక ప్రయాణానికి ఈ పాఠశాల ప్రారంభం నాంది అవుతుందని అభిప్రాయపడ్డారు.స్కూల్ కరెస్పాండెంట్ సుదగోని సంతోష్ మాట్లాడుతూ, కేంద్ర సహాయ మంత్రి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా పాఠశాలను ప్రారంభించుకోవడం తమకు…

మరింత

నేటి ప్రజావాణి రద్దు

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్‌లో నేడు (02.06.2025) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మరింత : జూన్ 10లోగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ భవనాలకు మార్చాలి – అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్  

మరింత

నేడే ఎలైట్ వరల్డ్ స్కూల్ ప్రారంభం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయంగా ,అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఎలైట్ వరల్డ్ స్కూల్ నేడే ప్రారంభిస్తున్నట్లు పాఠశాల కరెస్పాండెంట్ సుదగోని సంతోష్ ఒక ప్రకటన లో తెలిపారు.నర్సరీ నుండి 10 వ తరగతి వరకు స్టేట్ సిలబస్ తో పాటు ,సీబీఎస్ఈ విద్యా విధానంలో ఉత్తమమైన,అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధనా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా పలువురు విచ్చేయనున్నట్లు పేర్కొన్నారు. సమాజ నిర్మాణం లో విద్య ప్రముఖ…

మరింత

పొగాకు వ్యతిరేక దినోత్సవం పై అవగాహన సదస్సు

ప్రజాతెలంగాణ – కరీంనగర్: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేష్ ఆధ్వర్యంలో సీతారాంపురంలోని జిల్లా సెంట్రింగ్ ఓనర్స్ సొసైటీ భవనంలో అవగాహన సదస్సు నిర్వహించారు.పొగాకు వాడకం వల్ల ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుందని, క్యాన్సర్‌కు పొగాకు వాడకం ముఖ్య కారణమని తెలిపారు. బహిరంగంగా పొగ త్రాగడం నేరమని, దీనికి జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం కూడా…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!