
రాబోయే ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలి – మాజీ మేయర్ సునీల్ రావు
ప్రజాతెలంగాణ – కరీంనగర్ : రాబోయే ఎన్నికలన్నింటిలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని మాజీ మేయర్ సునీల్ రావు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలనను పురస్కరించుకుని గురువారం 33వ డివిజన్‌లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వ స్మార్ట్ సిటీ మరియు అభివృద్ధి పథకాలే కారణమన్నారు. గత 11 సంవత్సరాలలో ఈ పథకాల వల్ల కరీంనగర్ నగరం గణనీయంగా…