ఎస్ యూ పరిధిలో మూడో విడత దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలకు దోస్త్ మూడో విడత అడ్మిషన్లలో 7629 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు  కోఆర్డినేటర్ డా.శ్రీరంగ ప్రసాద్ తెలిపారు.విశ్వవిద్యాలయ పరిధిలోని మొత్తం 36,060 సీట్లలో మొదటి, రెండవ విడతలలో 9455 సీట్లు కేటాయించగా, వాటిలో 6730 మంది విద్యార్థులు అడ్మిషన్ ఖరారు చేసుకోగా, ఇంకా 29,330 సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో మూడో విడత ప్రక్రియ నిర్వహించారు.13 ప్రభుత్వ కళాశాలలలో 1060 మంది విద్యార్థులకు, 3…

మరింత

గృహ నిర్మాణ కార్మిక సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : గృహ నిర్మాణ కార్మికులకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామని కరీంనగర్ జిల్లా గృహ నిర్మాణ కార్మిక సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ , ముఖ్య సలహాదారులు మాజీ మేయర్ వై. సునీల్ రావు లు అన్నారు.ఆదివారం రేకుర్తిలోని పుష్పవల్లి గార్డెన్‌లో జిల్లా గృహ నిర్మాణ కార్మిక సంఘం కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లికార్జున రాజేందర్, న్యాయవాది ఏ.కిరణ్‌కుమార్,…

మరింత

అసంఘటిత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా: దరఖాస్తు గడువు పొడిగింపు

ప్రజాతెలంగాణ- కరీంనగర్ : అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకున్న, ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం పొందిన కార్మికులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నదని జిల్లా ఉపకార్మిక కమిషనర్ కోల ప్రసాద్ తెలిపారు. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన క్రింద ఆగస్టు 26, 2001 నుండి మార్చి 31, 2022 మధ్య ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకున్న, ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం పొందిన అసంఘటిత…

మరింత

కొత్తపల్లి పిహెచ్‌సిని సందర్శించిన డిఎంహెచ్‌ఓ డా.వెంకటరమణ

ప్రజాతెలంగాణ- కరీంనగర్: జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.వెంకటరమణ గురువారం కొత్తపల్లి పిహెచ్‌సిని సందర్శించారు.హాజరుపట్టిక, అవుట్ పేషెంట్ రిజిస్టర్లు, ఇతర రికార్డులను పరిశీలించి , పిహెచ్‌సి పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు.ఎన్‌సిడి క్లినిక్‌లో రెడ్, బ్లూ రిజిస్టర్లు చెక్ చేశారు. హైపర్‌టెన్షన్, డయాబెటిస్ పేషెంట్ల వివరాలు, మందుల పంపిణీ పరిశీలించారు. ఫార్మసీలో సీజనల్ మందుల స్టాక్ చూశారు.ఆపరేషన్ థియేటర్, ప్రసూతి గది పరిశుభ్రత, అత్యవసర మందుల లభ్యత పరిశీలించారు. మొదటి ప్రసవాలకు సిజేరియన్…

మరింత

సీపీని కలిసిన నూతన అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ

ప్రజాతెలంగాణ – కరీంనగర్: కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా బాధ్యతలు స్వీకరించిన అశ్విని తానాజీ వాకడె గురువారం పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. మరిన్ని వార్తల కోసం : రాబోయే ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలి – మాజీ మేయర్ సునీల్ రావు

మరింత

రాబోయే ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలి – మాజీ మేయర్ సునీల్ రావు

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : రాబోయే ఎన్నికలన్నింటిలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని మాజీ మేయర్ సునీల్ రావు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలనను పురస్కరించుకుని గురువారం 33వ డివిజన్‌లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వ స్మార్ట్ సిటీ మరియు అభివృద్ధి పథకాలే కారణమన్నారు. గత 11 సంవత్సరాలలో ఈ పథకాల వల్ల కరీంనగర్ నగరం గణనీయంగా…

మరింత

133.8 కిలోల గంజాయి దగ్ధం: సీపీ గౌస్ ఆలం

ప్రజాతెలంగాణ- కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 133.8 కిలోల గంజాయిని బుధవారం ధ్వంసం చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ తెలిపారు.మానకొండూరు మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్‌లో  డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో  ఈ గంజాయిని దహనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీపీలు వేణుగోపాల్, విజయ్‌కుమార్, ఇన్స్పెక్టర్లు పుల్లయ్య, సంజీవ్, రజినీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం :…

మరింత

మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు: సీపీ గౌస్ ఆలం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్ : నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్ సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు బుధవారం వెల్లడించారు.నార్కోటిక్ జాగిలం ‘లియో’తో జిల్లా కేంద్రంలో తనిఖీలను ముమ్మరం చేసినట్లు కమిషనర్ తెలిపారు. కరీంనగర్ ఒకటవ ఠాణా పరిధిలో బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఎస్సై రాజన్న ఆధ్వర్యంలో బస్టాండ్, పార్సిల్ కార్యాలయాలు, కిరాణా షాపులు, పాన్ షాపులు, హాస్టళ్లు,…

మరింత

లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 3478 కేసుల పరిష్కారం

– పీపీలను అభినందించిన కమీషనర్ ప్రజాతెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : గత శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 3,478 కేసులను విజయవంతంగా పరిష్కరించినందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సీపీ ఆలం అభినందించారు. కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని , కేసుల పరిష్కారంలో పోలీసు అధికారుల నుంచి ఏదైనా సమన్వయ లోపం కనిపిస్తే…

మరింత

శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎం.ఫార్మసీ కోర్సుకు ఆమోదం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరం నుండి ఎం.ఫార్మసీ కోర్సు ప్రారంభించడానికి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు.ఉమేష్‌కుమార్ తెలిపారు.మానేరు డ్యాం సమీపంలో ఉన్న ఫార్మసీ కళాశాలలో ఫార్మకాలజీ, ఫార్మాసిటిక్స్, ఫార్మాసిటికల్ అనాలసిస్ విభాగాలలో ఒక్కొక్కటిలో 15 సీట్లు చొప్పున మొత్తం 45 సీట్లతో ఎం.ఫార్మసీ కోర్సు ప్రారంభం కానుందని వారు వెల్లడించారు.ఎంతోకాలంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!