చొప్పదండిలో పద్మశాలి సంఘాల నూతన కమిటీల ప్రమాణ స్వీకారం

ప్రజాతెలంగాణ – చొప్పదండి : చొప్పదండి పట్టణంలో ఆదివారం పద్మశాలి కుల సంక్షేమ సంఘం, యువజన సంఘాల నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులుగా పచ్చునూరి తిరుపతి, అనుమల్ల సత్యం బాధ్యతలు స్వీకరించగా, ప్రధాన కార్యదర్శిగా వల్లాల జగన్, సంయుక్త కార్యదర్శిగా దూస రాము, కోశాధికారిగా దండె సత్యానందం ,. యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా గుండేటి వెంకటరమణ, కోశాధికారిగా పొరండ్ల నితీష్ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమానికి పెద్దపల్లి ఆర్డీవో బొద్దుల గంగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా, పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు , పద్మశాలి కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం :

అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కిన ఎక్సైజ్ సీఐ

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!