ప్రజా తెలంగాణ – కరీంనగర్ బ్యూరో : ఏప్రిల్ 2 నుండి 6 వరకు తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జరగనున్న సీపీఐ(ఎం) పార్టీ 24వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్ పిలుపునిచ్చారు.
శనివారం మానకొండూరు మండల కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సంపత్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం, వ్యవసాయ రంగానికి నిధుల కోత వంటి చర్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తలకోసం: పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ అమలు -కరీంనగర్ సీపీ
ఈ జాతీయ మహాసభల్లో గత మూడు సంవత్సరాల ప్రజా వ్యతిరేక విధానాలపై సమీక్ష జరిపి, భవిష్యత్తులో కార్మికులు, కర్షకులకు న్యాయం జరిగేలా పోరాటాల రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. మహాసభలను విజయవంతం చేయడానికి ప్రజల సహకారం అవసరమని, అందరూ తమ మద్దతు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.