ప్రజాతెలంగాణ – కరీంనగర్, : జాబ్ ఆఫర్ల పేరుతో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడిన ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను కరీంనగర్ సైబర్ పోలీసులు మహారాష్ట్రలో అరెస్ట్ చేశారు. బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్, రేటింగ్ రివ్యూ వర్క్, పార్ట్ టైం జాబ్స్ పేర్లతో బాధితుల నుండి మొత్తం ₹92 లక్షలు దోచుకున్న పూణే జిల్లా భోర్ తాలూకాకు చెందిన ప్రసాద్ సురేష్ గువహనే (26), చందన్ విట్టల్ గవనే (25), ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన శ్రేయస్ ముకుంద్ కలి (26) లను అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం వారిని రిమాండ్‌కు పంపింది.సైబర్ క్రైమ్ పోలీసుల వివరణ ప్రకారం నిందితులు లాభదాయకమైన ఆఫర్లతో ప్రజల నమ్మకాన్ని పొందిన తర్వాత బాధితుల బ్యాంక్ నుండి తమ ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారని తెలిపారు.కేవలం కరీంనగర్ జిల్లాలోనే రెండు కేసుల్లో ₹92 లక్షల మోసం చేసిన ఈ గ్యాంగ్‌పై ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు.ఈ సందర్బంగా సైబర్ పోలీసులు ప్రజలను అనుమానాస్పద కాల్స్, లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వ్యక్తిగత బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. మోసానికి గురైనవారు సైబర్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలని తెలిపారు.ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన సీఐ సునీల్, ఎస్ ఐ అనిల్ కుమార్ ల ప్రత్యేక బృందాన్ని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.
మరిన్ని వార్తల కోసం :