గణేష్ ఉత్సవాల్లో విషాదం: మండపంలో భజన చేస్తూ కళాకారుడి మృతి
గణేష్ ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. హనుమంతుడి వేషంలో ఉన్న ఓ కళాకారుడు గణేష్ మండపంలో జరిగిన భజనలో నృత్యం చేస్తూ గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో చోటుచేసుకుంది. కొత్వాలి ప్రాంతంలోని శివాలయంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి భజన కార్యక్రమం నిర్వహించారు. రవిశర్మ అనే భజన బృందం ఆంజనేయుడి వేషధారణలో నృత్యం చేసి అందరినీ అలరించారు. భజన ప్రకారం నృత్యం చేశాడు. కొంతసేపటికి ఒక్కసారిగా మండపంపైనే…


