
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తేనే పిల్లలకు బంగారు భవిష్యత్తు – సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
ప్రజాతెలంగాణ – కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉందని, పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సమక్షంలో నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు .సోమవారం శాంతినగర్లో జిల్లా విద్యాధికారి మొండయ్యతో కలిసి బడిబాట కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను గుర్తించాలని కోరారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మేధావులు, అన్ని రంగాలకు చెందిన…