
కలెక్టర్లు మానవీయకోణంలో భూసమస్యలు పరిష్కరించాలి – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ప్రజా తెలంగాణ – జగిత్యాల: కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భూసమస్యలు పరిష్కరించాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు .శుక్రవారం రాత్రి జగిత్యాల కలెక్టరేట్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణకుమార్, ఆది శ్రీనివాస్‌తో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు….