
ఎస్ యూ ఆంగ్ల విభాగంలో డిజిటల్ క్లాస్‌రూమ్ ప్రారంభం
ప్రజాతెలంగాణ – కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో ఆంగ్ల విభాగంలో డిజిటల్ క్లాస్‌రూమ్ ను మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సూరేపల్లి సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రిన్సిపాల్ సుజాత, “డిజిటల్ క్లాస్‌రూమ్ సాంకేతిక పరికరాలు, సాఫ్ట్‌వేర్‌లను వినియోగించి అత్యాధునిక విద్యను అందించే తరగతి గది. ఇది సాధారణ తరగతి గది కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ బోధన, అభ్యాసం డిజిటల్ పద్ధతిలో జరుగుతాయి” అని వివరించారు.డిజిటల్ క్లాస్‌రూమ్‌లో ఉపాధ్యాయులు స్మార్ట్ బోర్డులను ఉపయోగించి…