ఎస్ యూ పరిధిలో మూడో విడత దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలకు దోస్త్ మూడో విడత అడ్మిషన్లలో 7629 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు  కోఆర్డినేటర్ డా.శ్రీరంగ ప్రసాద్ తెలిపారు.విశ్వవిద్యాలయ పరిధిలోని మొత్తం 36,060 సీట్లలో మొదటి, రెండవ విడతలలో 9455 సీట్లు కేటాయించగా, వాటిలో 6730 మంది విద్యార్థులు అడ్మిషన్ ఖరారు చేసుకోగా, ఇంకా 29,330 సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో మూడో విడత ప్రక్రియ నిర్వహించారు.13 ప్రభుత్వ కళాశాలలలో 1060 మంది విద్యార్థులకు, 3…

మరింత

సీపీని కలిసిన నూతన అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ

ప్రజాతెలంగాణ – కరీంనగర్: కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా బాధ్యతలు స్వీకరించిన అశ్విని తానాజీ వాకడె గురువారం పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. మరిన్ని వార్తల కోసం : రాబోయే ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలి – మాజీ మేయర్ సునీల్ రావు

మరింత

రాబోయే ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలి – మాజీ మేయర్ సునీల్ రావు

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : రాబోయే ఎన్నికలన్నింటిలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని మాజీ మేయర్ సునీల్ రావు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలనను పురస్కరించుకుని గురువారం 33వ డివిజన్‌లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వ స్మార్ట్ సిటీ మరియు అభివృద్ధి పథకాలే కారణమన్నారు. గత 11 సంవత్సరాలలో ఈ పథకాల వల్ల కరీంనగర్ నగరం గణనీయంగా…

మరింత

కూచిపూడి పోటీల్లో హుజురాబాద్ చిన్నారికి ప్రథమ స్థానం

ప్రజాతెలంగాణ-హుజురాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జరిగిన కళా సమ్మేళన్ 2025లో కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీల్లో హుజురాబాద్ పట్టణానికి చెందిన వై.వినోద్-మహేందర్‌రెడ్డి దంపతుల కుమార్తె నిర్వి రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా బుధవారం కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి , హుజురాబాద్ రూరల్ బిజెపి నాయకులు చిదిరాల శ్రీనివాస్‌రెడ్డి-రాణి దంపతులు వై.నిర్వి రెడ్డిని అభినందించారు.ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు. మరిన్ని వార్తల కోసం : మత్తు…

మరింత

133.8 కిలోల గంజాయి దగ్ధం: సీపీ గౌస్ ఆలం

ప్రజాతెలంగాణ- కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 133.8 కిలోల గంజాయిని బుధవారం ధ్వంసం చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ తెలిపారు.మానకొండూరు మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్‌లో  డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో  ఈ గంజాయిని దహనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీపీలు వేణుగోపాల్, విజయ్‌కుమార్, ఇన్స్పెక్టర్లు పుల్లయ్య, సంజీవ్, రజినీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం :…

మరింత

మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు: సీపీ గౌస్ ఆలం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్ : నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్ సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు బుధవారం వెల్లడించారు.నార్కోటిక్ జాగిలం ‘లియో’తో జిల్లా కేంద్రంలో తనిఖీలను ముమ్మరం చేసినట్లు కమిషనర్ తెలిపారు. కరీంనగర్ ఒకటవ ఠాణా పరిధిలో బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఎస్సై రాజన్న ఆధ్వర్యంలో బస్టాండ్, పార్సిల్ కార్యాలయాలు, కిరాణా షాపులు, పాన్ షాపులు, హాస్టళ్లు,…

మరింత

ఆర్టిజన్ కార్మికుల బహిరంగ సభ ను విజయవంతం చెయ్యండి -కునుసోత్ శ్రీనివాస్ నాయక్

ప్రజాతెలంగాణ-కరీంనగర్ : రాష్ట్రంలోని ఆర్టిజన్ కార్మికుల రెగ్యులర్ కన్వర్షన్ కోసం జూన్ 18న హైదరాబాద్ ఇందిరా పార్కులో జరిగే బహిరంగ సభ ను విజయవంతం చెయ్యాలని కునుసోత్ శ్రీనివాస్ నాయక్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది ఆర్టిజన్ కార్మికులు 25 సంవత్సరాలుగా రెగ్యులర్ చేయాలని పోరాడుతున్నారని , గత ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ స్టాండింగ్ రూల్స్ మాత్రమే అమలు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు…

మరింత

ఘనంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

ప్రజాతెలంగాణ – కరీంనగర్:  జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  అని,  ఆయన ఇలాంటి  పుట్టినరోజు వేడుకలు  ఎన్నో జరుపుకోవాలని అన్నారు. గతంలో వారు తెలంగాణ వ్యాప్తంగా చేసిన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని…

మరింత

మంత్రిని కలిసిన నూతన కమిషనర్ ప్రపుల్ దేశాయ్

ప్రజాతెలంగాణ – కరీంనగర్ :కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రపుల్ దేశాయ్ ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. మరిన్ని వార్తల కోసం : శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎం.ఫార్మసీ కోర్సుకు ఆమోదం

మరింత

శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎం.ఫార్మసీ కోర్సుకు ఆమోదం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరం నుండి ఎం.ఫార్మసీ కోర్సు ప్రారంభించడానికి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు.ఉమేష్‌కుమార్ తెలిపారు.మానేరు డ్యాం సమీపంలో ఉన్న ఫార్మసీ కళాశాలలో ఫార్మకాలజీ, ఫార్మాసిటిక్స్, ఫార్మాసిటికల్ అనాలసిస్ విభాగాలలో ఒక్కొక్కటిలో 15 సీట్లు చొప్పున మొత్తం 45 సీట్లతో ఎం.ఫార్మసీ కోర్సు ప్రారంభం కానుందని వారు వెల్లడించారు.ఎంతోకాలంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!