
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
ప్రజాతెలంగాణ – కరీంనగర్: వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.శనివారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశంలో మాట్లాడిన కలెక్టర్, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని, నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ముఖ్యంగా తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టి నీటి నమూనాలను పరీక్షించి క్లోరినేషన్ చేయాలని…