
జిల్లా విద్యాధికారి పై వేటు
ప్రజాతెలంగాణ- కరీంనగర్ : ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను జిల్లా విద్యాధికారి జనార్దన్ రావును ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా విద్యాధికారిగా డైట్ కళాశాల ప్రిన్సిపాల్ మొండయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరిన్ని వార్తల కోసం : ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి – సీఎం రేవంత్ రెడ్డి