ప్రజాతెలంగాణ-కరీంనగర్ : రాష్ట్రంలోని ఆర్టిజన్ కార్మికుల రెగ్యులర్ కన్వర్షన్ కోసం జూన్ 18న హైదరాబాద్ ఇందిరా పార్కులో జరిగే బహిరంగ సభ ను విజయవంతం చెయ్యాలని కునుసోత్ శ్రీనివాస్ నాయక్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది ఆర్టిజన్ కార్మికులు 25 సంవత్సరాలుగా రెగ్యులర్ చేయాలని పోరాడుతున్నారని , గత ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ స్టాండింగ్ రూల్స్ మాత్రమే అమలు చేసిందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాదయాత్రల్లో ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు గడిచినా రెగ్యులర్ కన్వర్షన్ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 18న బహిరంగ సభ జరగనున్న బహిరంగ సభ ద్వారా తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోనున్నట్లు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం : లోక్ అదాలత్లో రికార్డు స్థాయిలో 3478 కేసుల పరిష్కారం