ప్రజాతెలంగాణ -కరీంనగర్ : కరీంనగర్ పట్టణం లోని కోతిరాంపూర్‌లో గల ఎలైట్ వరల్డ్ స్కూల్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం పాఠశాల నిర్వాహకుల సమక్షంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్య, శ్రేష్ఠత మరియు సాధికారతలో పరివర్తనాత్మక ప్రయాణానికి ఈ పాఠశాల ప్రారంభం నాంది అవుతుందని అభిప్రాయపడ్డారు.స్కూల్ కరెస్పాండెంట్ సుదగోని సంతోష్ మాట్లాడుతూ, కేంద్ర సహాయ మంత్రి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా పాఠశాలను ప్రారంభించుకోవడం తమకు ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు.అత్యున్నత ప్రమాణాలతో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో నర్సరీ నుంచి ఏడవ తరగతి వరకు స్టేట్ సిలబస్‌తో పాటు సీబీఎస్‌ఈ విద్యా విధానంలో బోధనా తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.విద్యార్థులను నేటి కాలపు సవాళ్లను ఎదుర్కొనేలా తయారుచేయడమే తమ ప్రధాన లక్ష్యమని సంతోష్ స్పష్టంచేశారు. అడ్మిషన్లకు సంబంధించిన వివరాలకు 9491818484 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.
మరింత :