ప్రజా తెలంగాణ – కరీంనగర్ రూరల్: కొత్తపల్లి మండలం బావుపేటకు చెందిన నేరెళ్ల సన్నీ అలియాస్ దయాసాగర్ కుటుంబ సభ్యులతో గొడవపడిన తర్వాత కోపంతో ఆదివారం గ్రామంలోని వాటర్ ట్యాంక్‌పై ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న కానిస్టేబుల్ విజయరావు ఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంక్‌పై ఉన్న సన్నీతో ఓపికగా మాట్లాడుతూ కౌన్సిలింగ్ చేశాడు. యువకుడి అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి పరిస్థితిని చక్కదిద్దాడు.సంయమనంతో కౌన్సిలింగ్ చేసి యువకుడి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ విజయరావును కరీంనగర్ రూరల్ ఏసిపి శుభంప్రకాష్ నగ్రాల్, సిఐ నిరంజన్‌రెడ్డి, కొత్తపల్లి ఎస్‌ఐ సాంబమూర్తి అభినందించారు.
మరింత :