ప్రజాతెలంగాణ – కరీంనగర్ : గృహ నిర్మాణ కార్మికులకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామని కరీంనగర్ జిల్లా గృహ నిర్మాణ కార్మిక సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ , ముఖ్య సలహాదారులు మాజీ మేయర్ వై. సునీల్ రావు లు అన్నారు.ఆదివారం రేకుర్తిలోని పుష్పవల్లి గార్డెన్‌లో జిల్లా గృహ నిర్మాణ కార్మిక సంఘం కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లికార్జున రాజేందర్, న్యాయవాది ఏ.కిరణ్‌కుమార్, మాజీ వైస్ చైర్మన్ డి.వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలు నిర్మాణ కార్మికులకు, వారి కుటుంబాలకు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. గృహ నిర్మాణ కార్మికులకు బీమా, మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, పదవీ విరమణ చేసిన వారికి పింఛన్ వంటి సౌకర్యాలు అందేలా కృషి చేస్తామని వెల్లడించారు.అందరి సహకారంతో కార్మిక సంఘం స్వంత భవనం కోసం స్థల పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు.2025-2028 మూడు సంవత్సరాల కాలానికి బి.చెంచయ్య అధ్యక్షుడిగా, కే.వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షుడిగా, ఎస్.కె.బాబు ప్రధాన కార్యదర్శిగా, టి.శ్రీనివాస్ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. టి.శ్రీను, జి.పవన్ ఉప కార్యదర్శులుగా, ఎం.సుబ్బారావు ఉప కోశాధికారిగా , కార్యవర్గ సభ్యులుగా 14 మంది ఎన్నికైనట్లు తెలిపారు .
మరిన్ని వార్తల కోసం :