ప్రజాతెలంగాణ – కరీంనగర్ : ప్రపంచ బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు బాల కార్మికుల నిర్మూలన కోసం ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. జడ్జి వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలని సూచించారు. చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు.ఎలాంటి చట్టపరమైన సమস్యలు ఉన్నా కూడా తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమం లో లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం : పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: కలెక్టర్ పమేలా సత్పతి