ప్రజాతెలంగాణ – కరీంనగర్ : రాబోయే ఎన్నికలన్నింటిలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని మాజీ మేయర్ సునీల్ రావు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలనను పురస్కరించుకుని గురువారం 33వ డివిజన్‌లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వ స్మార్ట్ సిటీ మరియు అభివృద్ధి పథకాలే కారణమన్నారు. గత 11 సంవత్సరాలలో ఈ పథకాల వల్ల కరీంనగర్ నగరం గణనీయంగా అభివృద్ధి చెందిందని తెలిపారు.భారతదేశం ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా ఎదగడానికి ప్రధానమంత్రి మోదీ పాత్ర గొప్పదన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, పాకిస్తాన్‌లోని తీవ్రవాదుల నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వంటి చారిత్రక నిర్ణయాలు గతంలో ఏ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలలో భారతదేశాన్ని నాల్గవ స్థానంలో నిలిపిన మోదీకి మద్దతు తెలుపాలని కోరారు.తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేవిధంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన స్మార్ట్ సిటీ నిధులు, కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి వంటి పనులను ప్రస్తావిస్తూ, ఇలాంటి అభివృద్ధి కొనసాగాలంటే ఆయనకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో మేధావులు, బీజేపీ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :
మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు: సీపీ గౌస్ ఆలం