– పీపీలను అభినందించిన కమీషనర్
ప్రజాతెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : గత శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 3,478 కేసులను విజయవంతంగా పరిష్కరించినందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సీపీ ఆలం అభినందించారు. కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని , కేసుల పరిష్కారంలో పోలీసు అధికారుల నుంచి ఏదైనా సమన్వయ లోపం కనిపిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కమీషనర్ సూచించారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పరస్పర సహకారంతో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని వారిని కోరారు.రానున్న అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశంలో చురుకుగా పాల్గొని పోలీసు అధికారులకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ మార్గదర్శకత్వం అందించాలని కమీషనర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కోరారు.
ఈ సమావేశం లో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, సీసీఆర్బీ ఏసీపీ జి.విజయ్‌కుమార్, డిప్యూటీ డైరెక्టर్ ఫర్ ప్రాసిక్యూషన్ డి.శరత్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె.శ్రీరాములు, అడిషనల్ పీపీలు ఏ.రాములు, గౌరు రాజిరెడ్డి, పి.కుమారస్వామి, కె.జాన్సీ, ఏపీపీలు గాయత్రి, జి.వీరాస్వామి, ఏ.రంజిత్‌కుమార్, ఇన్స్‌పెక్టర్ సంతోష్‌కుమార్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :