ప్రజాతెలంగాణ – కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో ఆంగ్ల విభాగంలో డిజిటల్ క్లాస్‌రూమ్ ను మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సూరేపల్లి సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రిన్సిపాల్ సుజాత, “డిజిటల్ క్లాస్‌రూమ్ సాంకేతిక పరికరాలు, సాఫ్ట్‌వేర్‌లను వినియోగించి అత్యాధునిక విద్యను అందించే తరగతి గది. ఇది సాధారణ తరగతి గది కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ బోధన, అభ్యాసం డిజిటల్ పద్ధతిలో జరుగుతాయి” అని వివరించారు.డిజిటల్ క్లాస్‌రూమ్‌లో ఉపాధ్యాయులు స్మార్ట్ బోర్డులను ఉపయోగించి పాఠాలను, వీడియోలను చూపించి విద్యార్థులకు సౌకర్యవంతమైన బోధనను అందిస్తారని తెలిపారు. ఈ సదుపాయాలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అనేక ప్రయోజనాలను అందిస్తాయని, సాంకేతిక విప్లవానికి తోడ్పాటు చేస్తాయని అన్నారు.ఆంగ్ల విభాగాధిపతి విజయప్రకాష్ మాట్లాడుతూ, డిజిటల్ క్లాస్‌రూమ్‌ను అందించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేష్‌కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు సాంకేతికతపై అవగాహన పెంచుకుని ఆధునిక సదుపాయాలతో ఆంగ్ల భాషను నేర్చుకోవాలని, స్మార్ట్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఆంగ్ల విభాగం విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం : జూన్ 30 వరకు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ