ప్రజాతెలంగాణ -కరీంనగర్ రూరల్ : మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వేగురుపల్లి గ్రామంలో బహిరంగ ప్రదేశంలో అక్రమంగా జూదం ఆడుతున్న ఐదుగురిని సోమవారం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.10,460 నగదు మరియు పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేయబడిన వారిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తము మానకొండూరు పోలీస్ స్టేషన్కు అప్పగించడం జరిగిందని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ తెలిపారు. జూదం, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరిన్ని వార్తల కోసం :