ప్రజా తెలంగాణ – కరీంనగర్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ & సోషల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.చికిత్స పొందుతున్న రోగులకు అరటిపండ్లు, ఆపిల్‌లతో కూడిన ప్యాకెట్లను అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో విద్య, సామాజిక అభివృద్ధి రంగాలలో కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో హరికృష్ణ, వేములవాడ అనిల్‌కుమార్, మీర్జా అనిల్, సాయిచందర్, సంజయ్, సాగర్, అఖిల్, వినీత్ పాల్గొన్నారు.
మరింత :


