Adipurush: మీ జానకి ఇదిగో.. ప్రభాస్ డైలాగ్ మామూలుగా లేదుగా..

Adipurush Prerelease event prabhas and kriti

ఒక ఉత్సవం ముగిసింది. కానీ.. ఆ ఉత్సవం తెచ్చిన ఉత్సాహం మాత్రం ఆగలేదు. వినోదం అంటే ప్రాణం పెట్టె తెలుగు ప్రజలు.. ప్రభాస్ లాంటి హీరో పబ్లిక్ లో మాట్లాడిన మాటలు అంత తొందరగా మర్చిపోలేరుగా. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (adipurush pre release event) గ్రాండ్ గా తిరుపతిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో ప్రభాస్ అభిమానులతో మాట్లాడారు. పబ్లిక్ లో మాట్లాడటానికి మొహమాట పడే ప్రభాస్.. అంతా పెద్ద ఈవెంట్ లో.. లక్షల మంది అభిమానుల మధ్యలో కొద్దిగా సిగ్గుపడుతూనే.. చాలా విషయాల గురించి మాట్లాడారు. అయితే, అభిమాన జన సందోహం ఆయన పెళ్లి గురించి నెరుగానే నినాదాలు చేసింది. దీంతో పెళ్లి చేసుకుంటా.. అదీ తిరుపతి లోనే అంటూ అభిమానుల్లో జోష్ నింపారు. ఇక ఆదిపురుష్ సినిమాలో నటించడం తన అదృష్టం అని చెప్పిన ప్రభాస్.. దర్శకుడు ఓం రౌత్ గురించి.. ఇతర నటుల గురించి స్టేజి మీద అనేక విషయాలు చెప్పి వారి కృషిని మెచ్చుకున్నారు.

ఈ నేపధ్యంలోనే ఆదిపురుష్ లో సీతగా నటించిన కృతి సనన్ గురించి ప్రభాస్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కృతి-ప్రభాస్ మధ్య ఏదో ఉందని అనుకుంటున్న అభిమానులకు ఆదిపురుష్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు.. అది నిజమేనేమో అనిపించే విధంగా ఉన్నాయని అంటున్నారు. కృతిని అభిమానులకు పరిచయం చేస్తూ.. ఇక ఈమె మీ జానకి అంటూ చెప్పారు. దానికి కృతి సిగ్గు పడుతూనే ముసిముసి నవ్వులు చిందించింది. అంతేకాదు.. ఈ సినిమాలో సీత పాత్రకు ఎవరిని తీసుకోవాలనే సందిగ్ధంలో చాలా కాలం ఆదిపురుష్ టీం ఉందని.. మంచి అమ్మాయిని సీతగా చూపించాలని భావించారని చెప్పారు. అందుకే మంచి అమ్మాయి కృతిని జానకి పాత్రకు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇక ఆమె నటన చాలా బావుందనీ.. సీతాగా ఒక దృశ్యంలో ఆమె బాధపడుతూ కనిపించాలని.. దానిని ఆమె చాలా చక్కగా చేశారనీ చెప్పారు. ఈ సమయంలో స్క్రీన్ పై కృతి నటించిన సీన్ ఇమేజ్ ప్లే చేశారు. అది చూపిస్తూ ప్రభాస్ ఎలా ఉంది అని అభిమానులను అడిగారు.. తరువాత కృతి ని పిలిచి ఇది నువ్వు చేసిందే కదా.. సీజీ కాదు కదా అని ఆటపట్టించారు. ఈ విషయంపై ప్రభాస్ మాట్లాడుతున్నంత సేపూ కృతి సిగ్గుపడుతూ పక్కకి జరిగిపోతూ ఉంది. ప్రభాస్ ఆమెను దగ్గరకు రమ్మని పిలుస్తూ మరీ మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. క్యూట్ గా సాగిన ఈ ఎపిసోడ్ అదిపురుష్ ఈవెంట్ లో ప్రభాస్ స్పీచ్ లో హైలైట్ గా నిలిచింది.

Also Read:

Adipurush: ఆదిపురుష్ గురించి చిరంజీవి అలా అన్నారట.. ప్రభాస్ ఎమోషన్..
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!