Super Star Krishna: వినీలాకాశంలో చుక్కల దరికి సూపర్ స్టార్.. నిత్య సాహసికి నివాళి
ఎక్కడ మొదలు పెట్టాలి? ఎవరి గురించి అయినా చెప్పాలి అనుకున్నపుడు వచ్చే మొదటి ప్రశ్న ఇది.. వెంటనే ఎదో మొదలు పెట్టాలి కనుక మొదలు పెట్టి ఆనక తాపీగా ఆ కథనం పూర్తి చేసేస్తాం. కానీ.. అందరి విషయంలో అలా చేయలేం. ఇప్పుడూ అదే సందిగ్ధం.. ఆయన వెళ్ళిపోయారు. ఎవరూ అందుకోలేని నట శిఖరాలను అందుకున్న నటుడు.. ఎవరికీ తలవంచే పధ్ధతి తెలీని వ్యక్తీ.. ఏటికి ఎదురీది విజయాన్ని అందుకోవాలనే సాహసి.. జీవితం చాలించారు. నట శేఖర్…


