కరీంనగర్ : డ్రోన్ల వినియోగంపై నిషేధాజ్ఞలు

ప్రజాతెలంగాణ – కరీంనగర్ :

కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో భద్రత కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఏయిర్ క్రాఫ్ట్ ల వినియోగాన్ని నిషేదించడం జరిగిందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిషేదాజ్ఞలు ఈనెల 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఏయిర్ క్రాఫ్ట్ లను ఈ మధ్యకాలంలో వివాహాది శుభకార్యాలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా వినియోగించబడుతున్నాయని తెలిపారు. ఉగ్రవాదులు, అసాంఘికశక్తులు వీటిని వినియోగించే అవకాశాలుండటంతో సదరు సాంకేతిక పరికరాల వినియోగాన్ని నిషేదించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా వినియోగించదలచినట్లయితే సంబంధిత పోలీసుల అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపిసి సెక్షన్ 188 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తల కోసం :    దేవక్కపల్లిలో క్రికెట్ పోటీలు ప్రారంభం

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!