ప్రజాతెలంగాణ – కరీంనగర్: జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని అన్నారు. గతంలో వారు తెలంగాణ వ్యాప్తంగా చేసిన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు నీరాజనం పడుతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.తదనంతరం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జింజుపల్లి వివేక్ ఆధ్వర్యంలో స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి తాజుద్దీన్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రావణ్ నాయక్, దండి రవీందర్, నితిన్ రెడ్డి, ఖలీముద్దీన్ పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :