Fight in Flight: విమానంలో ఫుడ్ కోసం ఫైట్.. రచ్చ రచ్చ చేసిన పాసింజర్..

Fight in Flight

విమానంలో ప్రయాణం (Fight in Flight) అంటే ఎంతో హుందాగా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ.. ఒక్కోసారి విమానంలోనూ రచ్చ.. రచ్చ.. జరుగుతుంది. సాధ్యమైనంతగా విమాన సిబ్బంది అదీ ముఖ్యంగా ఎయిర్ హోస్టెస్ లు సంయమనంతో.. ఓపికతో వ్యవహరిస్తారు. అటువంటి ఎయిర్ హోస్టెస్ అదీ సీనియర్ ఎయిర్ హోస్టెస్ తన సహనాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడితే ఏం జరుగుతుంది? ఇదిగో ఇటీవల ఇండిగో విమానంలో జరిగిన ఈ సంఘటనలా ఉంటుంది.

అసలేం జరిగింది..

ఇఫ్తాంబుల్ నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానంలో (Fight in Flight) ఒక ప్రయాణీకుడికి.. ఎయిర్ హోస్టెస్ కి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక ప్రయాణీకుడు అరుస్తూ కనిపిస్తున్నాడు. అతనికి అంటే తీవ్ర స్వరంతో ఎయిర్ హోస్టెస్ సమాధానం చెప్పడం కనిపించింది. క్యాబిన్ క్రూ భోజనాలు అందిస్తున్నపుడు ఈ సంఘటన జరిగింది. భోజనం విషయంలో ఒక ప్రయాణీకుడు ఎయిర్ హోస్టెస్ ను గట్టిగా ప్రశ్నించాడు. దానికి ఆమె శాంతంగా సమాధానం చెప్పింది. అతనికి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయితే, ఆ ప్రయాణీకుడు శాంతించలేదు. ఎయిర్ హోస్టెస్ పై అరుపులు మొదలు పెట్టాడు. ఎయిర్ హోస్టెస్(Air Hostess) ను నోరు ముయ్ అంటూ హెచ్చరించాడు. దీంతో ఎయిర్ హోస్టెస్ మీరు ఇలా మాట్లాడకూడదు ని గట్టిగానే చెప్పింది. దానికి ఆ ప్రయాణీకుడు మరింత ఆగ్రహంతో రెచ్చిపోయాడు. ఆమెను పనిమనిషి అని అర్ధం వచ్చేలా గట్టిగా మాటలు విసిరాడు. దీంతో సహనం నటించిన ఆ ఎయిర్ హోస్టెస్ అంటే తీవ్రంగా స్పందించింది. నేను మీ సేవకురాలిని కాదు.. ఉద్యోగిని.. మాటలు అదుపులో ఉంచుకో అంటూ గట్టిగా హెచ్చరించింది. దాంతో ఆ ప్రయాణీకుడు ఎందుకు అరుస్తున్నావ్ అంటూ మరింత కోపంగా గట్టిగా ప్రశ్నించాడు. దీనికి ఆ ఎయిర్ హోస్టెస్ (Fight in Flight) మీరు మాపై అరుస్తున్నారు కాబట్టి అంటూ సమాధానం ఇచ్చింది. ఈలోగా సమస్యను పరిష్కరించటానికి మరో ఎయిర్ ఇండిగో సిబ్బంది కలుగ చేసుకుని ఎయిర్ హోస్టెస్ ను పక్కకు తీసుకువెళ్ళాడు. ఇదీ జరిగింది.

ఆహారం కోసం ఆ ప్రయాణీకుడు చేసిన రచ్చ.. ఎయిర్ హోస్టెస్ గట్టిగ మాట్లాడడం అంతా వీడియో రికార్డ్ అయింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో ఇండిగో సంస్థ స్పందించింది. విమాన ప్రయాణీకుడి ప్రవర్తన సరిగా లేదని ఇండిగో చెప్పింది. ఎయిర్ హోస్టెస్ ను అవమానించారని తెలిపింది. ఆ ఎయిర్ హోస్టెస్ టీం లీడర్ అని చెబుతూనే.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. కస్టమర్ల సౌలభ్యం మా అత్యంత ప్రాధాన్యత అంటూ ఇండిగో (Indigo) ప్రకటించింది.

 

Also Read :

Spice Jet Pilot: వారిని ఎక్కువగా విసిగించకండి.. దెయ్యాలుగా మారిపోతారు.. స్పైస్ జెట్ పైలెట్ స్వీట్ వార్నింగ్..

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!