ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్: కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ చంద్రశేఖర్ బలవన్మరణం చెందారు. ఇటీవల ఆయన భార్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భార్య మృతి కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.
ఈ విషాద ఘటనతో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.
మరిన్ని వార్తల కోసం :


