ప్రజాతెలంగాణ – కరీంనగర్ :
పడాల కనకవ్వ గౌడ్ జ్ఞాపకార్థం ఆమె మనుమడు బుర్ర విజయ్ గౌడ్ నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు శనివారం దేవక్కపల్లిలో ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి కరివేద మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కాసింపేట, చిన్న ములకనూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని కోరారు .కాంగ్రెస్ నాయకుడు కంది వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. అమ్మమ్మను గుర్తు చేసుకుంటూ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు.స్పాన్సర్ బుర్ర విజయ్ గౌడ్ మాట్లాడుతూ.. అమ్మమ్మ అంటే చాలా ఇష్టమని, ఆమెపై అభిమానానికి నిదర్శనమే ఈ టోర్నమెంట్ అని అన్నారు.ఈ పోటీల్లో విజేతకు 20,000, రన్నర్ కు 10,000, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 5,000 ప్రైజ్ మనీ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రావుల రామకృష్ణారెడ్డి, ఒంటెల సంపత్ రెడ్డి, రావుల గోవర్ధన్ రెడ్డి, సొల్లు అజయ్ వర్మ, పడాల అశోక్ గౌడ్, వరుణ్, శరత్, తిరుపతి యాదవ్, రాజు గౌడ్, లక్ష్మణ్ రెడ్డి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :