
133.8 కిలోల గంజాయి దగ్ధం: సీపీ గౌస్ ఆలం
ప్రజాతెలంగాణ- కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 133.8 కిలోల గంజాయిని బుధవారం ధ్వంసం చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ తెలిపారు.మానకొండూరు మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్‌లో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ గంజాయిని దహనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీపీలు వేణుగోపాల్, విజయ్‌కుమార్, ఇన్స్పెక్టర్లు పుల్లయ్య, సంజీవ్, రజినీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం :…