కరీంనగర్-తిరుపతి ప్రత్యేక రైలు ప్రారంభం

ప్రజా తెలంగాణ – కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు కరీంనగర్-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు ప్రారంభం చేయనున్నట్లు రైల్వే శాఖ గురువారం ప్రకటించింది. జూలై 6 నుండి జూలై చివరివరకు ఈ రైలు నడిపించనున్నారు.వారానికి రెండుసార్లు నడుపుతారుఈ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం రాత్రి 7:45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 10:00 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. రిటర్న్ జర్నీలో సోమవారం సాయంత్రం 5:30కి కరీంనగర్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం…

మరింత

బాల కార్మికుల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : ప్రపంచ బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు బాల కార్మికుల నిర్మూలన కోసం ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. జడ్జి వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలని సూచించారు. చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని…

మరింత

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజాతెలంగాణ – కరీంనగర్ రూరల్ : అన్ని సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధంపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల పున:ప్రారంభ కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు పంపిణీ చేశారు. ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంతో వినూత్న కార్యక్రమాలు ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్, జిల్లాలో వినూత్న రీతిలో ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల…

మరింత

విద్యార్థులకు నాణ్యమైన భోజనం తయారు చేయాలి – కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజాతెలంగాణ – రామడుగు : ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని తయారు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వంట చేసే సిబ్బందికి సూచించారు.మంగళవారం జిల్లాలోని అన్ని కేజీబీవీలు, బాలికల రెసిడెన్షియల్ హాస్టళ్లలో వంట చేసే 90 మంది సిబ్బందికి రామడుగు మండలం వెదిర గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి  హాజరై సిబ్బంది వంట చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. శిక్షణలో భాగంగా వంట సిబ్బంది తయారుచేసిన భోజనాన్ని రుచి…

మరింత

ఎస్ యూ ఆంగ్ల విభాగంలో డిజిటల్ క్లాస్‌రూమ్ ప్రారంభం

ప్రజాతెలంగాణ – కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో ఆంగ్ల విభాగంలో డిజిటల్ క్లాస్‌రూమ్ ను మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సూరేపల్లి సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రిన్సిపాల్ సుజాత, “డిజిటల్ క్లాస్‌రూమ్ సాంకేతిక పరికరాలు, సాఫ్ట్‌వేర్‌లను వినియోగించి అత్యాధునిక విద్యను అందించే తరగతి గది. ఇది సాధారణ తరగతి గది కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ బోధన, అభ్యాసం డిజిటల్ పద్ధతిలో జరుగుతాయి” అని వివరించారు.డిజిటల్ క్లాస్‌రూమ్‌లో ఉపాధ్యాయులు స్మార్ట్ బోర్డులను ఉపయోగించి…

మరింత

జూన్ 30 వరకు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ

– అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ప్రజాతెలంగాణ- కరీంనగర్ : వర్షాకాలం నేపథ్యంలో వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తెలిపారు. ఈ కారణంగా జూన్ 30 వరకు రేషన్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటనలో వెల్లడించారు.ఆహార భద్రతా కార్డుదారులకు వ్యక్తికి ఆరు కిలోల చొప్పున, అంత్యోదయ కార్డుదారులకు నెలకు 35 కిలోల చొప్పున,…

మరింత

అంగన్వాడీ బాటకు సిద్ధం కావాలి- జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి

అంగన్వాడీ బాటకు సిద్ధం కావాలి- డీ డబ్ల్యు ఓ ఎం. సరస్వతి ప్రజా తెలంగాణ -కరీంనగర్ : జూన్ 12 నుంచి 17 వరకు నిర్వహించనున్న అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీలో చేర్పించేందుకు మహిళా శిశు సంక్షేమ అధికారులు సిద్ధం కావాలని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి తెలిపారు.శుక్రవారం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సిడిపిఓలు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి మేధో మథన సదస్సులో మంత్రి…

మరింత

బక్రీద్ పండగ ఏర్పాట్లకు కాంగ్రెస్ మైనారిటీ సెల్ వినతి పత్రం

ప్రజాతెలంగాణ-కరీంనగర్: ఈ నెల 7న జరగనున్న బక్రీద్ పండగ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దీన్ ఆధ్వర్యంలో  కలెక్టర్‌ పమేలా సత్పతి  ని  కలిసి వినతి పత్రం అందజేశారు.మూడు రోజుల పాటు జరుపుకునే బక్రీద్ పండగను పురస్కరించుకుని, నగరం మరియు జిల్లాలోని మూడు మునిసిపాలిటీలు, 14 మండలాల పరిధిలోని మసీదులు, ఈద్‌గాహ్‌లకు శానిటేషన్, వాటర్, కరెంటు సౌకర్యాలను కల్పించాలని కోరారు. పరిసర ప్రాంతాలను శుభ్రంగా నిర్వహించాలని కూడా అభ్యర్థించారు.పండగ రోజుల్లో మెడికల్…

మరింత

బక్రీద్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి – కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజాతెలంగాణ-కరీంనగర్ : జూన్ 7న వచ్చే బక్రీద్ పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలు పండుగ ఏర్పాట్లపై సూచనలు చేశారు.ఈద్గాల వద్ద అన్ని వసతులు కల్పించాలని, తాగునీరు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. నమాజ్ వేళల్లో కరెంటు కట్ లేకుండా చూడాలని ఆదేశించారు. మసీదుల వద్ద పరిశుభ్రత పాటించాలని,…

మరింత

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి – కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి కొత్త రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. భూ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడు ప్రాథమిక పాఠశాలలో, కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ అవగాహనా సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!