కరీంనగర్-తిరుపతి ప్రత్యేక రైలు ప్రారంభం

ప్రజా తెలంగాణ – కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు కరీంనగర్-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు ప్రారంభం చేయనున్నట్లు రైల్వే శాఖ గురువారం ప్రకటించింది. జూలై 6 నుండి జూలై చివరివరకు ఈ రైలు నడిపించనున్నారు.వారానికి రెండుసార్లు నడుపుతారుఈ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం రాత్రి 7:45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 10:00 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. రిటర్న్ జర్నీలో సోమవారం సాయంత్రం 5:30కి కరీంనగర్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం…

మరింత

ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ

ప్రజాతెలంగాణ – కరీంనగర్: జూన్, జులై, ఆగష్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ముందస్తుగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ ప్రకటించింది.జూన్ 1 నుంచి 30 వరకు బియ్యం, చక్కెర పంపిణీ చేస్తామని తెలిపింది. ఇప్పుడు తీసుకోకపోతే తర్వాత సెప్టెంబర్‌లో మాత్రమే రేషన్ అందుతుందని వెల్లడించింది.ఒకేసారి మూడు నెలల రేషన్ లభించడం తో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే మూడు నెలల బియ్యం ఒకేసారి అందించడం తో పాటు ,సెప్టెంబర్ వరకు రేషన్ తీసుకునే…

మరింత

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజాతెలంగాణ – కరీంనగర్: వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.శనివారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశంలో మాట్లాడిన కలెక్టర్, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని, నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ముఖ్యంగా తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టి నీటి నమూనాలను పరీక్షించి క్లోరినేషన్ చేయాలని…

మరింత

దేశ చరిత్రలోనే వరి సాగులో తెలంగాణ నంబర్ వన్ -ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రజాతెలంగాణ- వెబ్ డెస్క్  :  గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పండని విధంగా అత్యధికంగా దేశ చరిత్రలోనే తెలంగాణ వరి సాగులో నంబర్ వన్ గా నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.యాసంగీ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ధాన్యం…

మరింత

ఎస్ యూ పరిధిలో దోస్త్ మొదటి విడత కేటాయింపులు పూర్తి

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : ఎస్ యూ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో దోస్త్ ప్రవేశాల మొదటి విడత సీట్ కేటాయింపుల ప్రక్రియ పూర్తయిందని విశ్వవిద్యాలయ దోస్త్ కోఆర్డినేటర్ డా. ఎన్.వి. శ్రీరంగప్రసాద్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. మొత్తం 36,540 సీట్లకు నిర్వహించిన ఈ ప్రక్రియ లో మొదటి విడత కేటాయింపుల్లో కేవలం 5,931 సీట్లు మాత్రమే కేటాయించబడ్డాయని ఇంకా 30,609 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. 13 ప్రభుత్వ కళాశాలల్లో 297 మంది…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!