ప్రజా తెలంగాణ – కరీంనగర్ : ఎస్ యూ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో దోస్త్ ప్రవేశాల మొదటి విడత సీట్ కేటాయింపుల ప్రక్రియ పూర్తయిందని విశ్వవిద్యాలయ దోస్త్ కోఆర్డినేటర్ డా. ఎన్.వి. శ్రీరంగప్రసాద్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. మొత్తం 36,540 సీట్లకు నిర్వహించిన ఈ ప్రక్రియ లో మొదటి విడత కేటాయింపుల్లో కేవలం 5,931 సీట్లు మాత్రమే కేటాయించబడ్డాయని ఇంకా 30,609 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. 13 ప్రభుత్వ కళాశాలల్లో 297 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయని, 3 ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలల్లో 2,047 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారని వెల్లడించారు. అలాగే 60 ప్రైవేటు కళాశాలల్లో 3,587 మంది విద్యార్థులకు అవకాశం లభించిందని తెలిపారు.మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 6, 2025 లోపుగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్లను రిజర్వ్ చేసుకోవాలని , గడువులోపు రిపోర్టింగ్ చేయకపోతే సీట్ రిజిస్ట్రేషన్ రద్దవుతుందని డా. శ్రీరంగప్రసాద్ తెలిపారు .
మరిన్ని వార్తల కోసం :