– జూన్ 2న లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ
ప్రజాతెలంగాణ- వెబ్ డెస్క్ : రాజీవ్ యువ వికాసం పథకం క్రింద లాభసాటి వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్కు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథక పురోగతిని సమీక్షించిన ఆయన , 8 వేల కోట్ల పెట్టుబడితో 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
గత ప్రభుత్వాలు కార్పొరేషన్ ద్వారా మొక్కుబడిగా పథకాలు అమలు చేశాయని ,తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో యువతకు స్వయం ఉపాధి కల్పిస్తుందన్నారు. యువత వ్యాపారం చేసి లాభం పొందాలని, ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా పెట్టుబడిని కలెక్టర్లు రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని సూచించారు. రాష్ట్ర జీడిపి వృద్ధిలో ఈ పథకం భాగస్వామ్యం కావాలని డిప్యూటీ సీఎం అన్నారు.
మంజూరైన యూనిట్ల పనితీరు పర్యవేక్షణకు జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలని విక్రమార్క దిశానిర్దేశం చేశారు. మే 29-30లో ఇంచార్జి మంత్రుల సమావేశాల్లో తుది జాబితా ఆమోదం చేసి, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ నాడు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలని సూచించారు.
ఈ సమీక్షలో రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ,జిల్లా కలెక్టర్ లు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :