ఎస్ యూ ఎల్‌ఎల్‌బి పరీక్షల షెడ్యూల్ విడుదల

– 4 వ సెమిస్టరు బ్యాక్‌లాగ్‌లకు వన్ టైం ఛాన్స్

ప్రజా తెలంగాణ- కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్‌ఎల్‌బి కోర్సుకు సంబంధించిన పరీక్షల ప్రణాళిక ను పరీక్షల నియంత్రణ అధికారి డా. డి. సురేష్‌కుమార్ గురువారం వెల్లడించారు. ఎల్‌ఎల్‌బి ఆరవ సెమిస్టర్ పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభమై జూన్ 11న ముగుస్తాయని తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవ్వాలని సూచించారు.4 వ సెమిస్టరు బ్యాక్‌లాగ్ పరీక్షలకు ఈ సారి ప్రత్యేకంగా వన్ టైం ఛాన్స్ కల్పిస్తున్నామని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి పేపర్‌కు రూ. 1,500 చొప్పున రుసుము చెల్లించాలని స్పష్టం చేశారు.మరిన్ని వివరాలకు సంబంధిత కళాశాలలను సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను సందర్శించాలని డా. సురేష్‌కుమార్ సూచించారు.

మరిన్ని వార్తల కోసం :

ఎస్ యూ పరిధిలో దోస్త్ మొదటి విడత కేటాయింపులు పూర్తి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!