అంగన్వాడీ బాటకు సిద్ధం కావాలి- డీ డబ్ల్యు ఓ ఎం. సరస్వతి
ప్రజా తెలంగాణ -కరీంనగర్ : జూన్ 12 నుంచి 17 వరకు నిర్వహించనున్న అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీలో చేర్పించేందుకు మహిళా శిశు సంక్షేమ అధికారులు సిద్ధం కావాలని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి తెలిపారు.శుక్రవారం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సిడిపిఓలు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి మేధో మథన సదస్సులో మంత్రి అనసూయ సీతక్క పలు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.జిల్లాలోని 4 ఐసిడిఎస్ ప్రాజెక్టుల సిబ్బంది అంగన్వాడీ సేవలను బలోపేతం చేయాలని సూచించారు. పిల్లల్లో పోషణ లోపం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అంగన్వాడీలలో హాజరు శాతం పెంచాలని అన్నారు. తల్లిదండ్రులకు అంగన్వాడీలో అందిస్తున్న ప్రాథమిక విద్య, నాణ్యమైన పోషకాహారం గురించి తెలియజేయాలని సూచించారు.అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేసిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా చూడాలని అన్నారు. ఈ సమావేశం లో సిడిపిఓలు సబిత, నర్సింగారాణి, శ్రీమతి, సుగుణ పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :