ప్రజాతెలంగాణ – కరీంనగర్ : ఉప కార్మిక సహాయ శాఖ కార్యాలయంలో ఉప కార్మిక కమిషనర్ గా కోల ప్రసాద్ సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాదులో సహాయ కార్మిక కమిషనర్ గా విధులు నిర్వహించిన ప్రసాద్ పదోన్నతి పై కరీంనగర్ కార్మిక శాఖ కార్యాలయంలో విధులు చేరారు.ఈ సందర్భంగా ఉప కార్మిక కమిషనర్ ప్రసాద్ ను సహాయ కార్మిక కమిషనర్ ఎస్ వెంకటరమణ, సహాయ కార్మిక అధికారులు రఫీ మహమ్మద్, చక్రధర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్లు బి మనోజ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్లు మధుకర్ రావు, శ్రీకాంత్, దివ్య, వివిధ కార్మికుల సంఘాల నాయకులు సన్మానించి స్వాగతం పలికారు.
మరింత :